సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సౌత్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసి లాయర్గా పనిచేస్తుంది. గతంలో తెలుగు, మలయాళ, బెంగాలీ అని భాషలతో సంబంధం లేకుండా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆమె.. నటనతో పాటు అందమైన కనుసైగలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ సత్యజిత్ రే ఆమెను ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేయడం చూసి సినిమాలో అవకాశాన్ని ఇచ్చారు. అలా 1994 నుంచి 2002 వరకు సినీ ఇండస్ట్రీలో అమ్మే తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. ప్రేక్షకులను మెప్పించింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు సువలక్ష్మి. కోల్కతాకు చెందిన సువలక్ష్మి చదువుకునే రోజుల్లో.. సత్యజిత్ రే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ టైంలో ఆమె సోదరుడు ప్రమాదంలో చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లడం.. అదే టైంలో ఆమెకు అజిత్ మూవీ ఆసై సినిమాలో అవకాశం రావడంతో.. ఈ మూవీలో నటించి తన పాత్రలో ఒదిగిపోయింది. నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలా ఓవైపున సినిమాలో చేస్తూనే.. మరోవైపు సోదరుడు నెరవేర్చేందుకు లాయర్ విద్యను ప్రారంభించింది. తన చదువు పూర్తిచేసిన సువలక్ష్మి.. తర్వాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంది. అలా కార్తీక్ తో కలిసి.. గోకులతిల్ సితైలో కూడా మెరిసి.. మరింత పాపులారిటీ దక్కించుకుంది. కేవలం తమిళ్‌లోనే కాదు.. తెలుగులోనే ఈమె ఎన్నో సినిమాల్లో మెరిసింది.
ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. అయితే.. తన సినీ కెరీర్‌లో ఎప్పుడు ఈమె గ్లామర్ మెరుపులు మెరిపించలేదు. ఏ సినిమాలో అయినా చీరకట్టలో ఎంతో సాంప్రదాయంగా మెరిసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన గ్లామర్ షోకు దూరంగానే ఉన్న సువలక్ష్మి.. 2001 నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసి లాయర్ వృత్తి లోకి అడుగు పెట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. అలా 2002లో తన చిన్ననాటి స్నేహితుడు స్వాగత్ బెనర్జీని వివాహం చేసుకున్న సువలక్ష్మి తర్వాత అమెరికాలో సెటిలైంది. తన భర్త వ్యాపారాలను చూసుకుంటూనే.. లాయర్గా వృత్తిని కొనసాగిస్తుంది.