పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ” హరిహర వీరమల్లు ” కు సంధ్యా థియేటర్ పర్మిషన్ క్యాన్సిల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే అటు మెగా అభిమానులతో పాటు.. ఇటు పవన్ అభిమానుల సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణకు చెక్ ప‌డింది. ట్రైలర్‌ను నేడు గ్రాండ్గా ఏపీ, తెలంగాణ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ సిద్ధం చేశారు. కట్టుదట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు టీం. అయితే.. సినిమా ట్రైలర్ తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

sandhya70mm - Search / X

అసలు మేటర్ ఏంటంటే.. కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న వీరమల్లు చిట్టచివరకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. చక చక పూర్తి చేసేస్తున్నారు. ఈ క్రమంలోని వేగవంతంగా.. క్రేజీగా.. ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మూవీ యూనిట్ ముందడుగు వేస్తున్నారు. ట్రైలర్ ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు. వీరమల్లు సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కి పైగా థియేటర్లను సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో డజన్‌కు పైగా థియేటర్‌ల‌లో ట్రైలర్స్ రానుంది.

Hari Hara Veera Mallu Trailer: Are Pawan Kalyan Sad with Trailer?

ఇలాంటి క్రమంలో బాలానగర్ – విమల్ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ – సంధ్య థియేటర్‌ల‌లో ట్రైలర్ రిలీజ్ ను థియేటర్లో యాజమాన్యం వాయిదా వేశారట. గతంలో జరిగిన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని.. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతులు క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్లో యాజమాన్యం కూడా సినిమా హాల్ గేట్ ముందర.. వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం రద్దయిందని బోర్డులు పెట్టేసారు. దీంతో.. ఈ థియేటర్ అలంకరించి పండగ వాతావరణం సృష్టించాలని భావించిన ఫ్యాన్స్ అందరికీ డిసాపాయిట్మెంట్ మిగిలింది.