తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది అనుష్క. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ తన సత్తా చాటుకుంది. సూపర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ను పలకరించిన ఈ అమ్మడు.. అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు దశాబ్దన్నర కాలం పాటు తిరుగులేని క్రేజ్తో దూసుకుపోయిన అనుష్క.. బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలలో నటించలేదు. అయితే.. చాలా కాలం గ్యాప్ తర్వాత అనుష్క తాజాగా నటించిన మూవీ ఘాటి.
ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న క్రమంలో.. ఘటీ ప్రమోషన్స్‌లో సందడి చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఇండస్ట్రీకి ఏ విధంగా వచ్చిందో వివరించింది. మొదట్లో అసలు సినిమాలు చేద్దామని అనుకోలేదని.. చదువుకునే రోజుల్లో పెద్దగా సినిమాలే చూసే దాన్ని కాదని.. తర్వాత సినిమా ఆఫర్లు వచ్చి షూటింగ్ హడావిడి చూసి.. భయపడిపోయా. కంగారుపడి ఒకానొక టైం లో ఏడ్చేసా కూడా. ఈ హడావిడి చూసి యోగా టీచర్ గానే లైఫ్ బాగుంటుంది.. సినిమాలు వద్దే వద్దు అనుకున్నా.
కానీ.. నా కెరీర్‌ను అరుంధతి పూర్తిగా మార్చేసింది అంటూ వివరించింది. ఈ సినిమా తర్వాత దశాబ్ద కాలంకు పైగా.. వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోయిందని.. హారర్ సినిమాలంటేనే భయపడి పోయే నేను భాగమతి సినిమా చేశా.. కానీ ఆ సినిమాను నేను చూడలేదంటూ వివరించింది. ఇక బహుబలితో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన అమ్మడు.. మంచి పొజిషన్లో ఉండగా సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగి సినిమాలకు చెక్ పెట్టింది. తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది.