టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. ఈ క్రమంలోనే యూత్‌లో సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
ఇక తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, అనిరుధ్ కాంబినేషన్‌పై మరింత మాస్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ తన లైవ్ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. రాగిలే.. రాగిలే.. అనే మాస్ ఎలివేషన్స్ సాంగ్‌తో ఈవెంట్ కు బూస్టప్ ఇచ్చాడు. ఇక.. ఈ సాంగ్ కృష్ణకాంత్ రచించగా.. సిద్ధార్థ బస్రూర్ అలపించారు. సినిమాలో హీరో రోల్ ను, స్టోరీని ఎలివేట్ చేసే లెవెల్ లో మ్యూజిక్‌ను అనిరుధ్ పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేసి.. ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
ఈ క్రమంలోనే.. మాస్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ సాంగ్ వినాలని ఆరాటపడుతున్నారు. ఇక ఈ సాంగ్ సక్సెస్ కూడా సినిమాకు మరింత హైప్ ని తెచ్చి పెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అనిరుధ్ గతంలో హుక్కుమ్, ఫియర్ సాంగులతో ఏ రేంజ్ లో సూపర్ హిట్స్ అందుకున్నాడో తెలిసిందే. ఆ సాంగ్స్ గతంలో ప్లే లిస్టులో ఎంతలా ట్రెండ్ అయ్యాయో.. ఇప్పుడు కింగ్‌డంలో ఈ సాంగ్ సైతం చార్జ్ బూస్టర్‌లా వైరల్ అవుతుంది. ఇక.. సినిమా గురించి అనిరుధ్ మాట్లాడుతూ ఇచ్చిన రివ్యూ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నానురితో కలిసి నేను చేసిన ఈ ప్రాజెక్ట్ మా అందరి కెరియర్ లో ప్రత్యేక మైల్డ్‌స్టోన్‌గా నిలుస్తుంది అంటూ వివరించాడు. అలాగే.. నాగ వంశీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని.. అలాంటి ప్రొడ్యూసర్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. టెక్నీషియన్స్ కూడా సినిమాకు బెస్ట్ వర్క్ ఇచ్చారని.. కింగ్డమ్ అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే అనిరుద్ కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి.