బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో డేటింగ్లో ఉన్న విజయవర్మ.. గత కొంతకాలంగా ఆమెతో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలో విజయ్ వర్మ మరో హీరోయిన్ను వివాహం చేసుకోబోతున్నారంటూ.. త్వరలోనే వీళ పెళ్లి జరగనుంది అంటూ వార్తలు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. దానికి కారణం తాజాగా నెటింట వైరల్ అవుతున్న వీడియో. విజయవర్మ ఆ హీరోయిన్ను హగ్ చేసుకోవడం.. పబ్లిక్ లో ముద్దులు పెట్టడం చూసి జనం రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
నిజంగానే ఆ హీరోయిన్ తో విజయవర్మ పెళ్లికి రెడీ అయ్యాడు అంటూ.. అందుకే ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయవర్మ మనసు దోచేసిన ఆ ముద్దుగుమ్మ ఎవరో చెప్పలేదు కదా.. తనే దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసిన దంగల్ మూవీలో రెస్లర్గా మెరిసిన ఫాతిమా షేక్.. అందరికీ గుర్తుండే ఉంటుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలో అమెరికన్ పెద్ద కూతురు పాత్రలో మెరిసింది.
ఇక తాజాగా విజయ్ వర్మతో చట్టపట్టలేసుకొని తిరుగుతూ కనిపించింది. విజయవర్మ, ఫాతిమా ఇద్దరు ఒకే రెస్టారెంట్ నుండి బయటకు వస్తున్న తరుణంలో.. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు వారిని వీడియోలు తీశారు. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ఈ జంట ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాదు.. ఫాతిమా వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి వచ్చి విజయ్ వర్మను గట్టిగా హాగ్ చేసుకుని.. కిస్ చేసి మరి వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. విజయవర్మ ఫాతిమాను వివాహం చేసుకోబోతున్నాడని.. తమన్న కు హ్యాండిచ్చి వీళ్ళిద్దరూ పెళ్ళికి రెడీ అయిపోయారు అంటూ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.