మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. రకరకాల విషయాల్లో ట్రెండ్ గా మారుతున్నాడు తారక్. నటిస్తున్నది రెండు సినిమాలే అయినా.. విపరీతంగా నెటింట హల్చల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ విషయంలో సౌత్ వాళ్ళ ఫోకస్ ఓ రకంగా ఉంటే.. నార్త్ ఆడియన్స్ లో మరో రకంగా ఆయనపై అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోనే పాన్ ఇండియా లెవెల్లో తారక్ పేరు మారు మోగిపోతుంది. వార్ 2 సినిమా.. ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే.. సౌత్ ఆడియన్స్ కంటే బాలీవుడ్ ఆడియన్స్ లో ఈ సినిమాపై మరింత క్రేజ్ మొదలైంది. ఇటీవల తారక్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ దాన్ని మరింతగా పెంచేసింది. వార్ 2 పై ఉన్న అంచనాలు ఆకాశానికి అందేలా చేసింది.
కబీర్ క్యారెక్టర్ గురించి ఎన్టీఆర్ వాయిస్‌లో వినడం సూపర్ ఫ్యాక్టర్ గా నిలిచిందని.. హృతిక్ అభిమానులు.. తెగ మురిసిపోతున్నారు. అలాగే.. ఎన్టీఆర్ విజువల్స్ కూడా స్టానింగ్ గా ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్ పై వెళ్లి ఇద్దరి మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ చూడడానికి సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచే ఫ్యాక్టర్లలో తారక్ హృతిక్ కాంబోలో ప్లాన్ చేసిన సాంగ్ కూడా ఒకటి. ఆ సాంగ్ ను ఈ నెల చివర్లో షూట్ చేసేందుకు టీం ప్లాన్ చేసుకుంటున్నారట. అలాగే.. ఇద్దరు హీరోలు వారం రోజులపాటు ఈ సాంగ్ షూట్లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సాంగ్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ కూడా ప్రారంభించారట. ఇక.. నాటు నాటులో ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులకు ఎలాంటి క్రేజ్ పాపులారిటీ వచ్చిందో తెలిసిందే.
ఇప్పుడు వార్ 2లో హృతిక్, తారక్ మధ్యన వచ్చే సాంగ్ అంతకుమించి లెవెల్లో ఉండనుందని అంటున్నారు. ఇండస్ట్రీలో హృతిక్, తారక్ ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లుగా క్రేజ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో రానున్న ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను షేక్ చేస్తుందని నమ్మకాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్.. డ్రాగన్. ఈ సినిమా టైటిల్ అఫీషియల్ గా ప్రకటించుకున్నా.. ప్రస్తుతం అదే రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతుంది. ఇక సినిమా కోసం తారక్ స్పెషల్‌గా మేకోవర్ అయ్యాడు. అంతేకాదు.. షూట్ విషయంలో కూడా అదిరిపోయే లెవెల్ లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలా తాజాగా ఓ స్పెషల్ సెట్స్ ను డిజైన్ చేస్తున్నారట. ఈ నెల మూడో వారం నుంచి ఆ స్పెషల్ సెట్స్ లోనే షూటింగ్ ప్రారంభం కానుందాన్ని టాక్. ఎన్టీఆర్ తో పాటు సినిమాలు నటించే కీలక యాక్టర్స్ అంతా ఆ స్కెడ్యూల్లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు సీక్వెన్స్ మరింత హైలెట్ అవుతుందని సమాచారం.