చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి చివరి మినిట్ లో బ్రేక్.. కారణం అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీర మల్లు మొదట జూన్ 12న రిలీజ్ అవుతుంది అని ప్రకటించగా.. సినిమా వాయిద్య పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. థియేటర్ల బంద్ వివాదం ఏ రేంజ్‌లో దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఏపి డిప్యూటీ సీఎం గా బిజీగా రాణిస్తున్న పవన్ సైతం టాలీవుడ్ పై విరుచుకుపడ్డారు. తనదైన స్టైల్‌లో హెచ్చరించాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులంతా దిగి వచ్చారు. ఏపీ ప్రభుత్వంతో వార్‌ వద్దని.. చంద్రబాబుతో మీటింగ్‌కు సిద్ధమయ్యారు. తమ సమస్యల గురించి చంద్రబాబుతో చర్చించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోని అఫీషియల్‌గా ఏపీ గవర్నమెంట్ నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి.. కందుల దుర్గేష్ టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు ఫోన్ చేసి మరి మీటింగ్‌కు ఆహ్వానించారు. చంద్రబాబుతో నాలుగు గంటలకు అపాయింట్మెంట్ కుదరగా.. అంతకంటే ముందే డిప్యూటీ సీఎం పవన్ ను కలవాలని వాళ్ళు భావించారు. ఇక ఈ భేటిలో.. హాజరు కావలసిన ప్రముఖుల లిస్ట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్‌ అశ్విన్‌ ప్రొడ్యూసర్లు అశ్వినీద‌త్త్‌, దిల్ రాజు, అల్లు అరవింద్, కె.వి.రామారావు, హీరోలు.. బాలకృష్ణ‌, వెంకటేష్, మనోజ్‌, సుమన్, ఆర్. నారాయణ మూర్తి, నాని ఇలా దాదాపు 35 మందికి పైగా ప్రముఖులు ఉన్నారట.

పవన్ దెబ్బకి దిగొచ్చిన టాలీవుడ్.. చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ.. ఎప్పుడంటే? | Pawan Kalyan effect: Tollywood Celebrities To Meet AP CM Chandrababu Naidu - Telugu Filmibeat

ఇలాంటి క్రమంలో నేడు సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగాల్సి ఉండగా.. తాజాగా దాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌కు హాజరు కావాల్సిన పలువురు ముఖ్యమైన ప్రముఖులు.. నేడు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు చేసినట్లు సమాచారం. ఇక ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం.. చంద్రబాబు, ప‌వ‌న్‌లు ఆహ్వానం అందించినా.. ప్రముఖులు అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్‌ల‌తో.. మంత్రి కందుల దుర్గేష్ మీటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.