ప్రస్తుతం తెలుగు సినిమాలు గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే క్రేజ్, రేంజ్‌కు తగ్గట్టుగా.. కథలను సిద్ధం చేసి హీరోలను ఎలివేట్ చేయడానికి దర్శకులు తెగ కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే కథ నచ్చి.. డైరెక్టర్ స్క్రిప్ట్ పై నమ్మకం ఉంటే.. హీరోస్ సైతం ఎలాంటి రిస్కైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. నిర్మాతలు కూడా ముందడుగు వేస్తున్నారు. కథకు తగ్గట్టు కాస్ట్యూమ్, లొకేషన్స్ ఇలా ప్రతీది పక్కగా ఉండేలా నిర్మాతలు చూసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు భారతీయ సినిమాలన్నీ భారీ సెట్స్ పై కాకుండా.. విఎఫ్ఎక్స్ మరియు సిజిఎల్ పై ఆధారపడుతూ వచ్చింది. కానీ.. ఇప్పుడు అది పాత పద్ధతి. ప్రస్తుతం దర్శకుల దగ్గరుండి తమకు నచ్చినట్లుగా ఆర్ట్ డైరెక్టర్లతో సెట్స్ నిర్మింప చేస్తున్నారు.
టెక్నాలజీని ఉపయోగించి భారీ సెట్లను నిర్మించే పాత పద్ధతి పూర్తిగా మారిపోకపోయినా.. మెల్లమెల్లగా ఆ పద్ధతికి చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసి మరి సెట్‌ను నిర్మింప చేశారు. ఇది ఒక పెద్ద నగర పరిణామాన్ని చూపించేలా ఉండనుంది. అంతే కాదు.. భారతీయ సినీ ఇండస్ట్రీలోనే ఇది అత్యంత ఖరీదైన సెట్ కావడం విశేషం. ఇంతకీ ఆ సెట్ వివరాలేంటో.. ఎందుకంత బడ్జెట్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. జక్కన, మహేష్ కాంబోలో ఒక కీలక ఘట్టంలో వారణాసిలో జరగనుంది. దీనికోసమే రాజమౌళి వారణాసిని హైదరాబాద్ కు తెచ్చేలా సెట్స్ వేస్తున్నాడు. కాశీనగరాన్ని పునఃసృష్టించానున్నాడట.
రియల్ లొకేషన్లో షూట్ చేయడం కష్టం. కనుక రామోజీ ఫిలిం సిటీ లో వారణాసి నిర్మించనున్నాడు. ఇప్పటికే సెట్ వర్క్ దాదాపు పూర్తయిందని.. ఈ సెట్ ఖర్చు రూ.50 కోట్లు అంటే.. భారతీయ సినీ చరిత్రలోనే ఖరీదైన సెట్ అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సెట్ విషయంలో జక్కన్న టీం చాలా జాగ్రత్తలు వహిస్తున్నారని.. ప్రతికూలతను పక్కాగా తెలుసుకొని సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెరకెక్కించే సినిమాలో ప్రతి చిన్న విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అంత 100% ఇచ్చేలా చూసుకుంటాడు. అలాంటిది మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇది.. కాశీనగరం సెట్స్ అంటే అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా సెట్స్ నిర్మిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ భారీ సెట్‌కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.