టాలీవుడ్ రెబల్ స్టార్ ఇజ్ బ్యాక్ అంటూ.. ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం.. డైరెక్టర్ మారుతి. ఆయన డైరెక్షన్లో ప్రభాస్ నటించిన తాజా మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ షూట్‌కు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెళ్లారు. వాళ్ళ అందరితో ప్రభాస్ సరదాగా ముచ్చటించిన ఫోటో ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మారుతీ.. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను పంచుకున్నాడు. అందులో ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్, స్మైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆయన లుక్స్ గురించే సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. అంత అందంగా ప్రభాస్ మెరిశాడు. అంతేకాదు.. సినిమా విషయంలో ఇక ప్రభాస్ అభిమానుల వెయిటింగ్‌కు తెరపడినట్లే.
తాజాగా.. సినిమా టీజర్ రిలీజ్ టైం ను లాక్ చేశారు మేకర్స్. జూన్ 16న ఈ టీజర్ రిలీజ్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ఆ టీజర్ రిలీజ్ టైంతో సహా.. మారుతి వివరించాడు. సోమవారం ఉదయం 10:52 యూట్యూబ్ సోషల్ మీడియా అకౌంట్లో ఈ టీజర్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే టీజర్‌తో ఆడియన్స్‌లో హైప్‌ని పెంచగలిగితే.. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనటంలో సందేహం లేదు. ఇక.. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి తెరకెక్కుతున్న హారర్ కామెడీ జోనర్ మూవీ కావడం, అలాగే.. ప్రేమ కథ చిత్రం, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండుగ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీలు తెరకెక్కించడం.. మారుతి డైరెక్షన్లో రూపొందుతుండడంతో.. ప్రభాస్‌ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఇక.. ఈ సినిమా నుంచి.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రభాస్ స్టిల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. టీజర్ ఎలా ఉండనుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కాపూర్ అన్నారు. ఈముగ్గురిలో మాళవిక యాక్షన్ బ్యూటీగా కనపడనుందట. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్బై.. టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో తెలుగుతోపాటు.. హింది, కన్నడం, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.