టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ లైనప్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఫౌజి రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ లీకైనా.. క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అలా.. ఇప్పటికే ఫౌజి సినిమా జైల్ సెట్స్ లీకైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ అంతా కీలకపాత్రలో మెరువనున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న క్రమంలో రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలు రూపొందిస్తున్నారు. ఈ సినిమా భారత స్వాతంత్రానికి పూర్వం జరిగే కథ. యుద్ధ నేపథ్యంతో పాటు.. బలమైన ఎమోషన్స్ ను కలిగి తెరకెక్కుతుంది. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ 1940 కాలం నాటి బ్రిటిష్ ఇండియన్ నేపథ్యంలో రూపొందనుంది. ప్రభాస్ ఇందులో ఓ సోల్‌జర్‌గా కనిపించనున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే ప్రేమ కథగా.. హనురాగపూడి అద్భుత కావ్యంగా రూపొందిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా కోసం యూత్ డేట్ లను కేటాయించి బిజీ బిజీగా గడుపుతున్నారు. అన్నిటికంటే ముందు కమిట్ అయిన సినిమాలు సైతం పక్కనపెట్టి మరీ.. ఫౌజి సినిమా సెట్స్‌లో సందడి చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ప్రభాస్ ఫౌజి సెట్‌లో ఉన్న పిక్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక.. ఈ లుక్స్‌లో ప్రభాస్ చాలా స్లింగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగానే ప్రభాస్ బయటకు కూడా రావడం లేదని సమాచారం. పౌజీ లుక్.. లీక్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే కన్నప్ప ప్రమోషన్స్ లో సైతం ప్రభాస్ పాల్గొనలేదట. వీడియో బైట్ ఇవ్వాలనుకున్న చివరకు వద్దని నిర్ణయించుకున్నాడట. ఈ లుక్ రివిల్ చేయొద్దని టీం సైతం చాలా ప్రయత్నాలు చేస్తుంటే.. ఇలా ఎవరో ఒకరు సెట్స్ నుంచి సీక్రెట్ లీక్‌లు ఇస్తూనే ఉన్నారు.