వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజా డీలక్స్ పేరుతో సెట్స్ పైకి వచ్చిన సినిమా రెండేళ్ల షూటింగ్ తర్వాత ది రాజా సబ్ టైటిల్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. గ్లింప్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా టీజర్ సైతం రిలీజ్ అయి ఆడియన్స్‌లో భారీ లెవెల్లో హైప్ నెలకొల్పింది. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కపూర్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా మెరవనున్నారు. ఇక ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ కామెడీ టైమింగ్ జనాలకు ఫుల్ కిక్కి ఇచ్చింది.
వింటేజ్ ప్రభాస్‌ని చూడాలని ఎప్పటి నుంచి ఆరాటపడుతున్న ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్ కానుంది. రాజాసాబ్ సినిమా షూటింగ్‌కు అప్పుడెప్పుడో గుమ్మడికాయ కొట్టిన.. సంజయ్ దత్ లాంటి స్టార్ కాస్టింగ్ సెట్స్ లో అడుగు పెట్టకపోవడంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని మేకర్స్ భావించారట. దీంతో ప్రభాస్ ఇంకా రెండు నెలలపాటు ది రాజాసాబ్ సినిమా షూట్ లోనే పాల్గొనాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక షూటింగ్ అయిన తర్వాత దాదాపు నాలుగు నెలల పాటు పూర్తి గ్రాఫిక్ వర్క్స్ జరుపుకున్న ది రాజాసాబ్ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 5, 2025న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. కాగా.. ఈ క్రమంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ గ్రాఫిక్స్ రీ షూట్స్ అంటూ సాగదీత కారణంగా.. ఏకంగా రూ.50 కోట్ల వరకు నష్టపోయాడని టాక్ నడుస్తుంది.
అదేంటంటే. సాధారణంగా బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక్క సినిమాకు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సాహో యావరేజ్ టాక్ రావడం.. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక సలార్ బ్లాక్ బస్టర్ కావడం.. కల్కి 2898ఏడి సైతం మంచి రిజల్ట్ అందుకోవడంతో.. ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగింది. ఆది పురుష్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడం.. ఇక వారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఉండడంతో.. ఈ నష్టాలను పూడ్చేందుకు ది రాజా సాబ్ సినిమాను ప్రభాస్ ఇదే బ్యానర్లో ఒప్పుకున్నాడు. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకునే ప్రభాస్.. ఈ సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే చార్జ్ చేసినట్లు తెలుస్తుంది.