బ్రో డైరెక్టర్‌తో పవన్ కొత్త ప్రాజెక్ట్.. ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అందరూ హీరోల కంటే వైవిధ్యమైన ఫ్యాన్ బేస్‌తో రాణిస్తున్నాడు. సొంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోనూ మంచి సక్సెస్ అందుకుని.. ఏపీ డిప్యూటీ సీఎం గా ప‌గాలు చేప‌ట్టాడు. ఇలాంటి నేపథ్యంలోనే.. ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను మాత్రమే పూర్తి చేసి.. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడు అని.. రాజకీయ, సినీ వర్గాల నుంచి వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే వార్తలకు తగ్గట్టు ఆయన డిప్యూటీ సీఎంగా.. పగ్గాలు చేపట్టిన తర్వాత ఎలాంటి కొత్త సినిమాకు కూడా సైన్ చేయలేదు.

కాగా.. ఆయన అప్పటికే ఒప్పుకున్న ఓజి, హరిహర వీరమల్లు సినిమా షూట్లను మాత్రం కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూట్లో సందడి చేస్తున్న పవన్.. దాదాపు నెలరోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ కు తనకు సంబంధించిన అన్ని సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూట్ పూర్తయిన తర్వాత పవన్ మరో సినిమా చేసేందుకు సిధ్ధం అవుతున్నాడ‌ని టాక్‌నడుస్తుంది. ఇంతకీ ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి.. ఆ మూవీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా.. ఆయ‌నే బ్రో మూవీ ద‌ర్శ‌కుడు.. స్టార్ న‌టుడు సముద్రఖని.

Pawan Kalyan's joins the next schedule of BRO in swag and style! -  TeluguBulletin.com

గ‌తంలో పవన్ – స‌ముద్ర‌ఖ‌ని కాంబోలో బ‌చ్చిన బ్రో మూవీ ఊహించిన రేంజ్‌లో స‌క్స‌స్ అందుకోలేక పోయింది. ఇలాంటి నేప‌ద్యంలో ప‌వ‌న్‌ కళ్యాణ్ కోసం.. మరో సరికొత్త క‌థ‌ను స‌ముద్ర‌ఖ‌ని సిద్ధం చేశాడట. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడని.. పవన్ సినిమా స్టోరీ విన్న తర్వాత డేట్స్ ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి సముద్రఖని స్టోరీ పవన్ కు నచ్చిందా.. సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.. లేదా.. ఎప్పుడు డేట్ ఇస్తారు.. అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ మరో సినిమా చేయడం అంటే.. అది అసలు వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు మొద‌ల‌య్యాయి.