నైజాంలో పవన్ ” ఓజి ” బిజినెస్ సెన్సేషన్.. టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డ్..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సైన్‌ చేసిన సినిమాల షూట్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం పవన్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ డీవివి ఎంటర్టైన్స్ బ్యానర్‌పై డీవివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే.. ఓజీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా రూపొందుతుంది. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూట్ ఇప్పటికే చాలా ఆలస్యమైన క్రమంలో.. సినిమాను సరవేగంగా పూర్తి చేసి.. రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు టీం. ఈ క్రమంలోనే.. సినిమాపై అంతకంతకు క్రేజ్ పెరుగుతూ వస్తుంది. కాగా సినిమా ఇంకా సర్టిఫై ఉండగానే.. థియేట్రిక‌ల్‌ బిజినెస్ పీక్స్ లెవెల్‌లో జరుగుతుంది.

OG' surprise: Big name steps in behind the camera

రికార్డ్ లెవెల్‌లో హక్కులు అమ్ముడుపోతున్నాయి. అలా.. తాజాగా థియేట్రికల్ రైట్స్ నైజాం బిజినెస్‌లో ఓజి సంచలనం సృష్టించింది అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. నైజాంలో రికార్డ్ ధరకు ఓజి రైట్స్ అమ్ముడుపోయాయట. ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ముంబై ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు.. ఇప్పటివరకు రూ.250 కోట్ల వరకు ఖర్చయిందట. అంతేకాదు పవన్ కళ్యాణ్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. త్వరగా షూట్‌ను పూర్తి చేసి.. సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే.. పవన్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ.. క్షణం తీరిక లేకుండా షూటింగ్‌లో సందడి చేస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పక్కన జరుగుతూనే ఉంది.

OG (2025) - IMDb

ఈ క్రమంలోనే బిజినెస్ కూడా ఊపు అందుకుంది. తాజాగా.. నైజం థియేట్రిక‌ల్‌ బిజినెస్ రికార్డ్ ధరకు క్లోజ్ అయిందట. ఓజి నైజాం హక్కులు ఏకంగా రూ.90 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బిజినెస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించిన బిజినెస్ లు కూడా ఇదే రేంజ్ లో ఉన్నట్టు టాక్‌ నడుస్తుంది. ఇక గ‌తేడాది పవన్ బర్త్డే సందర్భంగా సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్‌లో విశేషమైన ఆదరణ పొందాయి. ఈ క్రమంలో అనేక‌ సినిమాలో నటించే ఆర్టిస్టులు, టెక్నికల్ టీం సినిమాపై ఇస్తున్న హింట్స్.. ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు నైజాం బిజినెస్ చేసిన సంచలనం.. ఆ హైప్ ఆకాశానికి అంటేలా చేసింది. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయాల్సి ఉంది.