తారక్ కోసం ఆ హాట్ ఫిగర్ ను దింపిన నీల్.. ప్లాన్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న తారక్.. ఈ సినిమా తర్వాత దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోనున్నాడు. ఈ క్ర‌మంలోనే సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లతో అదరగొట్టింది. ఇక ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ రానున్న ప్రాజెక్టులపై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Prashanth Neel shares upcoming Jr NTR film, 'Dragon' will be a periodic drama | - Times of India

ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే.. తారక్, ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమా షూట్‌లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక.. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్.. నటించనున్న‌ సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. తారక్‌ సరసన స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు.. ఓ హాట్ బ్యూటీని రంగంలోకి దింపాడట ప్రశాంత్ నీల్. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. కేతిక శర్మ. ఎస్.. మీరు వినది కరెక్టే. డ్రాగన్ మూవీ లో యంగ్ టైగర్‌తో పాటు.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో మెరవ‌నుందట.

Ketika Sharma hot photoshoot stills - South Indian Actress

ఇప్పటికే.. కేతిక శర్మను టీం అప్రోచ్ కాగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై మేకర్స్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక.. కేతిక శర్మ చివరిగా నితిన్‌ రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. శ్రీ విష్ణు సింగిల్ సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు మరోసారి స్పెషల్ సాంగ్ లో తారక్ పక్కన చిందేయనుందని టాక్ వైరల్ అవడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి మొదలయ్యింది. ఇక గతంలో సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చేయడాది జూన్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో తారక్‌ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటాడో.. ప్రశాంత్ నీల్‌ ఎన్టీఆర్‌కి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో వేచి చూడాలి.