కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కళకళలాడుతూ కనిపిస్తుంది. వేసవిలో స్టార్ హీరోలో సినిమాలేవి రాకపోవడంతో డిలా పడిపోయిన థియేటర్లు.. నాని హిట్ 3 సక్సెస్‌తో ఓ మోస్తారుగా రన్ అయ్యాయి. అయితే.. మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని రోజులు మాత్రమే థియేటర్లలో సందడి చేసింది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులుగా సందడి లేక వెలవెలబోతున్న థియేటర్లు తాజాగా రిలీజై.. కుబేరతో మరోసారి స్పెషలిటీ సంతరించుకున్నాయి. రిలీజ్‌కు ముందు పెద్ద హడావిడి కానీ.. హైప్‌ కానీ లేని కుబేర.. ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. బిగ్ స్క్రీన్ పై సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీ లెవెల్లో కొల్లగొట్టేయని సమాచారం.

మంచి నెంబర్‌ను ద‌క్కించుకున్న కుబేరా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు, నాలుగు రోజుల ముందు నుంచే ఓపెనింగ్స్ ప్రారంభం కాగా.. తమిళనాడులో మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో ముందు రోజు మాత్రమే బుకింగ్ ప్రారంభించారు. అయినప్పటికీ కేవలం సినిమా మౌత్ టాక్‌తో పాజిటివిటీ స్ప్రెడ్ అయింది. అలా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళ్లో కలిపి ఏకంగా రూ.13 కోట్ల మీద నెట్ వ‌శూళ్లు వచ్చినట్లు సమాచారం. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నెంబర్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Kuberaa' box office collection day 1 early estimate: Dhanush, Nagarjuna  Akkineni and Rashmika Mandanna-starrer mints Rs 12.98 crore | Tamil Movie  News - Times of India

కేవ‌లం తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర చోట్ల కూడా కుబేర కు మంచి ఆదరణ దక్కుతుంది. అలా నార్త్ అమెరికాలో ఇప్పటికే రికార్డు లెవెల్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో కుబేర 900 డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ముందు ముందు ఏ రేంజ్ లో కలెక్షన్స్ను అందుకుంటుందో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా.. ధనుష్ బిచ్చగాడిగా కనిపించగా.. నాగార్జున రిటైర్డ్ ఎస్బిఐ ఆఫీసర్గా మెరిసాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా అందరితోను ప్రశంసలు అందుకుంటుంది. శేఖర్ కమల టేకింగ్ తో పాటు.. ధనుష్, నాగ్‌, రష్మికల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్.