కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా స్ట్రైట్ తెలుగు మూవీ కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. ఏషియన్ సినిమా సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. డిఎస్పీ మ్యూజిక్ వ్యవహరించారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన టైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు.. సినిమాపై భారీ లెవెల్లో హైప్ క్రియేట్ చేసింది. ఇక శేకర్ కమ్ములా డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఈనెల 20 (రేపు) ధియేటర్‌లలో గ్రాండ్ లెవెల్ రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే మూవీ థియేట్రికల్ బిజినెస్, రికవరీ టార్గెట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
సినిమా బజ్‌కు తగ్గట్లుగానే.. థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరిగిందట. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను.. రూ.33 కోట్లకు రైట్స్ అమ్ముడుపోగా.. తమిళ్లో రూ.18 కోట్లు, కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.8.50 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇలా మొత్తంగా రూ.130 కోట్లు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో కుబేర థియేటర్‌ల్లోకి అడుగుపెట్టనుంది.
అయితే ఈ సినిమా విషయంలో అభిమానులను ఆందోళన పెడుతున్న ఒకే ఒక్క ప్రాబ్లెమ్ రన్ టైం. ఈ సినిమాకు ఏకంగా మూడు గంటల రన్ టైం ఉండడం.. ఫ్యాన్స్ టెన్షన్ కారణం అవుతుంది. అసలు ఇది వర్కౌట్ అవుతుందా.. ఏకంగా మూడు గంటల సినిమా అంటే బోర్ కొట్టకుండా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయగలరా.. శేఖర్ కమ్ముల నరేషన్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందా.. లేదా.. అని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్‌లో సక్సెస్ దక్కించుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే.