కోలివుడు స్టార్ హీరో ధనుష్ ఆడియన్స్‌ను మెప్పించేలా కంటెంట్ ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలో నటిస్తున్నాడు. అలా.. తాజాగా ధనుష్ నటించిన మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడు గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ధనుష్ నట వీశ్వరాపం చూపించి.. ఆడియన్స్‌తో ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ భాషలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అదిరిపోయే కనెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్, బిజినెస్ లెక్కలు, బాక్సాఫీస్ ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్ల వివరాలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాలో ధనుష్‌తో పాటు.. రష్మిక మందన, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు.
బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ విలన్ పాత్రలో మెరిసాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సంగీతం అందించగా.. టెక్నీషియన్స్ కూడా భారీ మొత్తంలో నాణ్యంగా సినిమాను రూపొందించారు. ఖర్చులు, ప్రమోషన్లు అన్నీ కలుపుకొని సినిమాకు రూ.120 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. ఈ సినిమా పై టీజర్, ట్రైలర్ ప్రమోషన్స్ తో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొల్పారు మేకర్స్. ఈ క్రమంలోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరిగిందట. నాన్థియెట్రికల్ బిజినెస్ ద్వారా.. రూ.45 కోట్ల బిజినెస్ జరగగా.. తెలుగు నుంచి రూ.40 కోట్లు, తమిళ్ నుంచి రూ.20 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మిగతా స్టేట్స్, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ.5 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ సినిమా లాభాల్లోకి వెళ్లాలంటే రూ.60 కోట్ల ఇండియన్ షేర్ వసూళ్లు.. రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు కల్లగోట్టాల్సి ఉంది.
ఇక.. ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నెలకొన్న హైప్ రిత్యా ఓపెనింగ్స్‌తో 3 లక్షల25 వేల టికెట్లు.. బుక్‌మైషోలో అమ్ముడుపోయాయట. అంటే.. దాదాపు రూ.4 కోట్లు ఓపెనింగ్స్‌లోనే మేకర్స్ రాబట్టారు. మరోవైపు.. కేవలం ఓవర్సీస్లోనే ఓపెనింగ్ డే.. 100డాలర్లు కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది కుబేర. ఇక ప్రపంచవ్యాప్తంగా కుబేర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు అలా ఇండియన్ నెట్ రూ.14.75 కోట్లు ఇందులో తెలుగు రూ.10 కోట్లు, తమిళనాడు రూ.4.5కోట్లు, హిందీలో రూ.23 లక్షలు, కన్నడలో రూ.2 లక్షలు కలెక్షన్లు కొలగొట్టింది. ఇండియన్ గ్రాస్ రూ.17.35 కోట్లు ఓవర్సీస్లో రూ.10.15 కోట్లు.. ఇండియన్ ప్లస్ ఓవర్సీస్ వసూలు కలిపి మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.27.50 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిందని సాక్ నీల్క్ రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలోనే.. కుబేర మొదటి రోజు ఇండియాకు ధిటుగా ఓవర్సీస్లో వసూళ్లు కొల్లగొట్టి ధనుష్ ర్యాంపేజి చూపించాడు. ఇక రెండవ రోజు సినిమా రూ.16 కోట్ల ఇండియన్ నెట్ వశూళ్లు కొల్లగొట్టినట్లు సాక్ మిల్క్ రిపోర్ట్లు వెల్లడించాయి. రెండవ రోజు ఈ సినిమా ఇండియన్ నెట్ వసూలు రూ.30.75 కోట్లు వరల్డ్ వైడ్ గా రూ.55 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.