” కుబేర ” రివ్యూ.. ధనుష్, నాగ్ కాంబో హిట్ కొట్టిందా..?

టాలీవుడ్ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా తెర‌కెక్కించిన మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాలో.. నాగార్జున కీలకపాత్రలో మెరిసారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఎస్పీ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజ్ అయింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. నాగ్‌, ధనుష్‌ల కాంబో వర్కౌట్ అయిందో.. లేదో.. ఒకసారి రివ్యూలో తెలుసుకుందాం.

Kuberaa (Kubera) Movie Review: What's Good, What's Bad In Dhanush-Starrer;  Find Out Here - Oneindia News

స్టోరీ:
దీపక్ (నాగార్జున) ఎక్స్ ఎస్బిఐ ఆఫీసర్. తాను చేసే ఒక ఆపరేషన్‌లో దేవా (ధనుష్) అనే బిచ్చగాడిని భాగం చేసుకుంటాడు. కలిసి ఈ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మరి దేవా వల్ల దీపక్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. దీపక్ ఎందుకు ఆపరేషన్ కోసం దేవాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు.. అస‌లు ర‌ష్మిక పాత్ర ఏంటి.. అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.

రివ్యూ:
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్ట్రైట్‌గా తాను ఎంచుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు చూపించడంలో ఇప్పటికే సక్సెస్ అయిన శేఖర్ కమ్ముల.. మొదటి పది నిమిషాల్లోనే సినిమా స్టోరీ మనకు పూర్తిగా అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చేశాడు. క్యారెక్టర్స్ మధ్య డ్రామాలు క్రియేట్ చేస్తూ ప్రేక్షకుడికి ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి.. సినిమాలో ధనుష్ కాకుండా మరో హీరో ఉన్న ఈ సినిమా అసలు వర్కౌట్ కాదన్న ఫీల్ ఆడియన్స్‌లో కలుగుతుంది. ధనుష్ బిచ్చగాడు పాత్రలో అంతగా ఒదిగిపోయాడు. ఇక ఈ సినిమాలో ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నారో.. దాన్ని స్ట్రైట్ గా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు.

Kuberaa Twitter reviews: Dhanush delivers 'god-level' performance in 'rare  gem' by Sekhar Kammula - Hindustan Times

ఫ‌స్ట్ హాఫ్ ల్యాగ్‌ అనిపించినా.. సెకండ్ హాఫ్ లో ధనుష్ క్యారెక్టర్ మీద సినిమా అంతా నడిచింది. ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్‌లో ధనుష్ చెప్పే మాటలు ఆడియన్స్‌లో హైలైట్ గా నిలిచాయి. కోర్ ఎమోషన్స్‌లో డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ సినిమాకు మరింత హైలెట్. నాగార్జున కూడా.. ఈ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఆడియన్స్‌ సినిమా బోర్ కొట్టకుండా తన పాత్ర తాను వహించాడు. ఈ సినిమాలో మైనస్ పాయింట్ అంటే మొదటి పది నిమిషాల్లో స్టోరీ చెప్పేయడమే. దీంతో మిగిలిన రెండు గంటలు ప్రేక్షకుడిని హోల్డ్ చేసి కూర్చోబెట్టడం కొంతవరకు కష్టమైందనే చెప్పాలి.

అలా కాకుండా స్క్రీన్‌ప్లేను కొద్దిగా మార్చుంటే ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగేది అనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా ఉండడంతో.. ఇంటర్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆడియన్స్‌ ఎదురుచూస్తున్న పరిస్థితి సినిమాకు మైనస్. ఇక సినిమాలో విలన్ రోల్ పెద్దగా ఎలివేట్ అయినట్టు లేదు. మొదట ఐదు నిమిషాలు విలన్ పాత్ర స్ట్రాంగ్ గా చూపించిన తర్వాత.. అసలు ఆ పాత్ర పై క్లారిటీ లేకుండా రైవల్టి సరిగ్గా ఇవ్వలేకపోయారు.. ఇక ఈ సినిమా మొత్తం ఒకే పాయింట్ పై రన్ అవ్వడంతో.. సీన్స్ మొత్తం రిపీటెడ్ గా అనిపించాయి. నాగార్జున పాత్ర మరింత డెప్త్‌గా ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది.

King Nagarjuna Looks Dashing & Dapper In The First Look Of Kubera -  IndustryHit.Com

నటీనటుల పర్ఫామెన్స్:
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ధనుష్ బిచ్చగాడు క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఇటీవల ధనుష్ చేసిన సినిమాలన్నింటిలో పోలిస్తే ఈ పాత్ర ధనుష్‌కు మరింత ప్లస్ అవుతుంది. ప్రమోషన్స్‌లో చెప్పినట్టు నేషనల్ అవార్డు వచ్చిన అతిశయత్తలేదు. ఓ రకంగా ధనుష్ సెట్ అయినట్లు ఈ పాత్రకు మరెవ్వరు సెట్ కారు అన్నంతలా మెపించాడు. ఇక ఫస్ట్ హ‌ఫ్‌లో కొన్ని ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ లు ధనుష్ క్యారెక్టర్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఈ క్యారెక్టర్ లో మనకు ధనుష్ ఎక్కడ కనిపించడు.. దేవా క్యారెక్టర్ మాత్రమే ఉందనిపిస్తుంది. ఇక శేఖర్ కమ్ముల పేపర్ పై ఏం రాస్తాడో స్క్రిప్ట్ అంతకుమించేలా చూపిస్తాడు.

నాగార్జున సిబిఐ ఆఫీసర్గా తన పాత్రకు 100% న్యాయం చేశాడు. ముఖ్యంగా ఇంతకుముందు చేసిన డిఫరెంట్ పాత్రలకు మించి ఈ పాత్ర ప్లస్. ఈ సినిమాలో నాగ్ నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. విభిన్న హావభావాలు చూపిస్తూ.. సినిమా బోర్ అనిపించకుండా ప్రయత్నం చేశాడు. ఈ పాత్ర ఆయనలో సరికొత్త‌ యాంగిల్‌ను రివీల్ చేసింది. ఇక రష్మిక ఎప్పటిలానే.. తన పాత్ర నడివి మించకుండా సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో మెప్పించింది. డబ్బు పై పిచ్చి ఉన్న ఓ లేడీ ఆలోచనలు ఎలా ఉంటాయి.. ఏం చేస్తుంది.. ఆమెకు డబ్బుపై ఉన్న ఇంట్రెస్ట్ తనని ఎలా మార్చేస్తుంది.. అనే అంశాలను రష్మిక అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. విలన్‌గా నటించిన జీన్ స‌ర్బ్‌ తన యాక్టింగ్ తో మెప్పించాడు.

Kuberaa' X reviews: Dhanush delivered his 'career best' performance in  Telugu comeback, say netizens - The Economic Times

టెక్నికల్ గా:
డిఎస్పి మ్యూజిక్ సినిమాకు ప్లస్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ని హైలెట్ చేశాయి. విజువల్ పరంగా సినిమా ఆకట్టుకుంది. నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసార‌న్న‌ ఫీల్ సినిమా చూస్తే అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ విజువల్ గా చాలా బాగా ప్రతి సీను ఎలివేట్ చేశారు.

ప్లస్, మైనస్ లు:
ఓవరాల్‌గా సినిమాకు ధనుష్ యాక్టింగ్, నాగ్ క్యారెక్ట‌ర్‌, డైరెక్షన్, మ్యూజిక్ సినిమాకు ప్లస్. అయితే.. కథ, స్లో నరేషన్‌, అనవసరపు సీన్స్ కాస్త మైనస్ గా మారాయి.

రేటింగ్: 3/5