కుబేర.. ఆ రోల్ లో బాలయ్యను బీట్ చేయలేకపోయిన ధనుష్..!

చాలామంది స్టార్ హీరోలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని.. అడ్వెంచర్స్ రోల్స్‌లో నటించాలంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎక్కడ తమ ఇమేజ్ డామేజ్ అవుతుందో.. లేదంటే ఎక్కడ ఫ్యాన్స్ ఆ పాత్రల్లో చేస్తే ఒప్పుకోరు అనే సందేహాలతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎలాంటి పాత్రనైనా సరే కంటెంట్ బాగుంది.. వర్కౌట్ అవుతుంది అనిపిస్తే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించే అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ధనుష్ పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దర్శకులు తాము రాసుకునే కథల్లో వైవిధ్యమైన పాత్ర ఉంటే కచ్చితంగా ఆ సినిమాను ధనుష్‌తో నటింపజేయాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక దానికి తగ్గట్టుగానే ధనుష్ కూడా తను డి గ్రేడ్‌ క్యారెక్టర్ చేయమంటే అభిమానులు ఫీల్ అవుతారు.. మార్కెట్ పడిపోతుందని ఆలోచనలు పెట్టుకోడు. క్యారెక్టర్ బాగుంటే చాలు 100% న‌ట విశ్వ‌రూపపాని చూపించేందుకు ప్రయత్నిస్తాడు.

ఈ క్రమంలోనే ధనుష్ ఎన్నో సినిమాలతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించిన కుబేర మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో ధనుష్.. బిచ్చగాడు పాత్రలో నటించి విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ధనుష్ లాంటి సాహసోపెతమైన పాత్రలో మన టాలీవుడ్ హీరోలు ఎవరు నటించారని.. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో నటించేందుకు అసలు ఎవరు సాహసం కూడా చేయరు అంటూ రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై బాలయ్య ఫ్యాన్స్‌ రియాక్ట్ అవుతూ.. నిజానికి సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన భైరవద్వీపం మూవీలో.. బాలయ్య ఎప్పుడో ఇంతకంటే భయంకరమైన పాత్రలో.. నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడని వివ‌రిస్దతున్నారు.

ఈ సినిమాలో బాలయ్య పది నిమిషాల పాటు కుష్టి వ్యాధి సోకిన బిచ్చగాడిగా కనిపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడాని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తన కుష్టి వ్యాధి విరుగుడుకు శాపా విముక్తి కలిగేలా.. ప్రార్థిస్తూ తనకు క్షమాభిక్ష పెట్టమని బాలయ్య అడిగే సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య బిచ్చగాడి రోల్, పర్ఫామెన్స్ ముందు.. ధనుష్ నటన పెద్దగా ఏమీ అనిపించలేదంటూ.. ప‌లువురు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బాలకృష్ణ లాంటి నటుడు ఒక కమర్షియల్ హీరోగా సక్సెస్‌తో రాణిస్తున్న టైం లో కుష్టి వ్యాధి ఉన్న బిచ్చగాడు లాంటి.. డి గ్రేడ్‌ పాత్రలో నటించడం అంటే అది పెద్ద డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఇక బాలయ్య మొదటి నుంచి కొత్తదాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఇప్పటికీ బాలకృష్ణ వైవిధ్యమైన పాత్రలు వస్తే నటించడానికి ముందుంటాడు అంటూ బాలయ్య అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.