మంచి మోహన్ బాబు తనయుడు విష్ణు, మనోజ్లమధ్య కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర వివాదం గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో కోల్డ్ వార్‌గా మొదలైన ఈ వివాదం.. తర్వాత రోడ్డుకెక్కింది. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అంటూ తిరగడం.. మీడియా ముందు మనోజ్ రచ్చ రచ్చ చేయడం.. అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వివాదంలో పోలీసులు ఇన్వాల్వ్ కావడంతో గొడవ సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ.. ఈ అన్నదమ్ముల మధ్య వివాదం తాజాగా మరో కొత్త మలుపు తీసుకుంది. మనోజ్ దగ్గర పనిచేసే రఘు, చరిత అనే ఇద్దరు వ్యక్తులు కన్నప్ప హార్డ్ డిస్క్ ను దొంగిలించారని విష్ణు మంచు చెప్పుకొచ్చాడు. ఎవరైనా చెబితే వాళ్ళిద్దరూ ఆ పని చేశారా.. లేదా అనేది నాకు ఇంకా తెలియదని.. చెన్నైలో జరిగిన కన్నప్ప ప్రెస్ మీట్ లో ఆయన వెల్లడించాడు.
అన్నయ్య ఆరోపణలపై తమ్ముడు మంచు మనోజ్ ఇప్పటివరకు రియాక్ట్ కాకపోవడం.. చర్చనియాంసంగా మారింది. అయితే.. మనోజ్ దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తో తాజాగా భైరవం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో స్ట్రాంగ్ త్రో బ్యాక్ ఇవ్వాలని మంచు మనోజ్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మనోజ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇందులో భాగంగా తాజాగా భైరవం సక్సెస్ మీట్లో కన్నప్ప హార్డ్ డిస్క్ ప్రస్తావన మొదలైంది. ఇక ఈ ఈవెంట్లో ఓ ఇంటర్వ్యూ వరకు కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అయిందని.. అది మీ దగ్గరే ఉందని విష్ణు మంచు చెబుతున్నారు అంటూ మనోజ్ ను ప్రశ్నించగా.. మీకు ఇచ్చాను కదా.. మీరు ఎక్కడ పెట్టారు.. మీరే కదా ఆరోజు వచ్చి తీసుకున్నారు.. అంటూ సరదా కామెంట్లు చేశాడు.
నేను ఇక్కడికి వచ్చింది భైరవం సినిమా గురించి.. కనుక ఈ సినిమా విషయం వరకు మాట్లాడండి అంటూ వివరించాడు. ఇటీవల నేను విషయం చెప్పా. ఒకప్పుడు ఆ సినిమా గురించి ఫన్ చేశా. కానీ.. సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుంది.. ఇప్పటికీ ఆ సినిమా సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. భైరవం సక్సెస్.. ఈ సినిమాకు వస్తున్న పాజిటివిటీ.. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమను చూసి మీరు నన్ను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా అది జరగదు.. నేను రెచ్చిపోను.. ఇంతమంది ప్రేమ ముందు అది అసలు నాకు కనిపించడం లేదు.. అందుకనే కనప్ప హార్డ్ డిస్క్ గురించి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక భైరవ మూవీ రిలీజ్ రోజున మనోజ్ మోహన్ బాబు తో కలిసి ఉన్న ఫోటోతో ఆయన కొడుకు వచ్చాడని చెప్పు.. అనే క్యాప్షన్‌ను జోడించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోను ఉద్దేశిస్తూ భైరవం మూవీలో మనోజ్ నటన మోహన్ బాబును గుర్తు చేస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారని అడగగా.. అది నాకు నాన్న నుంచి వచ్చిన ఆస్తి.. డిఎన్ఏ లోనే ఉంది అంటూ సమాధానం చెప్పాడు. దీనిపై విష్ణు మంచు ఎలా రియాక్ట్ అవుతాడో వేసి చూడాలి.