టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీతకు నెటింట ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన గ్లామర్ ట్రీట్‌తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు హాట్ ట్రిట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ తల్లితో కలిసి పలు ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు.. అమ్మడు గతంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈమె నటించిన మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ షార్ట్ ఫిలిం అమ్మడికి మంచి పాపులారిటి తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
చౌదరి గారి అబ్బాయ్యి.. నాయుడు గారి అమ్మాయి.. మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. బిగ్ బాస్ అమర్‌దీప్ హీరోగా.. నటించిన ఈ సినిమా మాల్యాద్రి రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కనుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, గ్లింప్స్‌లో సుప్రీత క్యారెక్టర్ హైలెట్గా నిలిచింది. ఇక మొదటి నుంచి.. సెలబ్రిటీ కిడ్‌గానే పెరిగిన సుప్రీత.. చిన్నప్పటి నుంచి తల్లితో పాటు సెట్స్‌కు వెళ్లి సందడి చేసేది. ఎప్పటికైనా హీరోయిన్ కావాలనే కలలు కంటూ ఉండేది. ఎట్టకేలకు ఆమె కలలు నిజం చేసుకుంది.
2016 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పలు రీల్స్‌తో సందడి చేసిన ఈ అమ్మడు.. డిగ్రీ పూర్తయిన వెంటనే 2019లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సిరీస్‌లలో నటించింది. గ్లామర్ ఫోటోలతో ఎప్పటికప్పుడు కుర్ర కారకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ.. తన ఇన్‌స్టా వేదికగా తొమ్మిది లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందే.. ఈ రేంజ్ పాపులారిటి దక్కించుకున్న సుప్రీత.. తల్లితో కలిసి పలు ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ.. అప్డేట్స్ సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అమ్మ నా వాలంటైన్ అంటూ పలు సందర్భాల్లో ఆమె వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అమ్మడు సినిమాకు ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది.