ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోలను సైతం మించి పోయే రేంజ్లో వీరు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తుంటే.. బన్నీ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం.. బన్నీ ఏకంగా రూ.300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడట. అయితే.. ప్రభాస్, అల్లు అర్జున్, షారుక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలకే షాక్ ఇచ్చేలా.. ఓ బుల్లితెర యాంకర్ కమ్ కమెడియన్.. రెమ్యూనరేషన్‌తో సంచలనం సృష్టిస్తున్నాడంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరు తెలుసుకుందాం. అతను మరెవరో కాదు.. ప్రముఖ బుల్లితెర యాంకర్.. హాస్యనటుడైన కపిల్ శర్మ. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నిర్వహిస్తున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో థర్డ్ సీజన్ మల్లి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 21, 2025 స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గస్ట్గా హాజరై సందడి చేశారు.
ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఓ తాజా ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ అవుతూ వస్తుంది. ఈ షోకు సంబంధించి కపిల్ శర్మ రెమ్యూనరేషన్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. కపిల్ శర్మ ఫస్ట్ సీజన్‌కు ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేశాడట. అంటే.. మొత్తం 13 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రూ.5 కోట్లు చొప్పున.. రూ.65 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. 2024 మార్చి 30 నుంచి.. జూన్ 22 వరకు ఈ సీజన్ ప్రసారమైంది. అలాగే.. సెకండ్ సీజన్లో 13 ఎపిసోడ్లు.. 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14 వరకు టెలికాస్ట్ అయ్యాయి. సెకండ్ సీజన్లో కపిల్ శర్మ అదే రెమ్యూనరేషన్‌ను ఛార్జ్ చేశాడు. అయితే ప్రస్తుతం నడుస్తున్న మూడో సీజన్‌కు కూడా అదే రేంజ్లో రెమ్యూనరేషన్‌ను తీసుకుంటున్నాడట కపిల్ శర్మ.
ఈ సీజన్ కూడా దాదాపు 13 ఎపిసోడ్ ఉంటాయి. అంటే మరో రూ.65 కోట్లు. ఇలా ఇప్పటివరకు తన క్రేజ్, పాపులారిటీ, కామెడీ సీన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ వచ్చిన కపిల్ శర్మ.. మూడు సీజన్లతో కలిపి.. ఏకంగా రూ.195 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు, దీని ప్రకారం.. పాన్ ఇండియా లెవెల్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న టాప్ యాంకర్ గా కపిల్ శర్మ రికార్డ్ క్రియేట్ చేసినట్లే. అసలు మొదట ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఫస్ట్ సీజన్ 2024 లో ప్రారంభమైంది. అంటే ఇప్పటికి 16 నెలలు పూర్తయింది. 16 నెలలలో రూ.195 కోట్లు సంపాదించాడు. అంటే.. అది సాధారణ విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం ఏదైనా సినిమా చేయాలంటే దాదాపు 2 ఏళ్లు సమయం కేటాయిస్తున్నారు. వాళ్ళు ఆ రెండేళ్ల కష్టానికి రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుంటే.. కపిల్ శర్మ మాత్రం కేవలం 16 నెలల్లో ఏకంగా రూ.195 కోట్లు దక్కించుకున్నాడు. దీని ప్రకారం కపిల్ శర్మ ఆదాయం పాన్ ఇండియన్ స్టార్ హీరోలను మించిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు.