కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ధనుష్.. తెలుగులో సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఆడియన్స్‌కు మరింత దగ్గర అయ్యాడు. ఇప్పుడు మరోసారి కుబేర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాల్లో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. నాగార్జున కీలకపాత్రలో మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక రేపు జూన్ 20న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే.. ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన మేకర్స్ తర్వాత చెన్నైలోనూ గ్రాండ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఐదు గంటలకు ధనుష్ మాట్లాడుతూ.. ఇంటరెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తనను మాస్ కమర్షియల్ మూవీస్ చేయమని కొందరు సలహా ఇచ్చారని.. మరికొందరు యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటించమని చెప్పారని.. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సజెస్ట్ చేస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేశారని.. కానీ తన నుంచి ఎప్పుడు ఏ రకమైన సినిమా అయినా రావచ్చని ధనుష్ వివరించాడు. కోవిడ్ టైంలో ది గ్రే మ్యాన్ షూటింగ్‌లో ఉన్న సమయంలో నాకు కుబేర స్టోరీ వచ్చిందని.. వీడియో కాల్‌లోనే 20 నిమిషాల పాటు స్టోరీ మొత్తం చెప్పేసారని చెప్పుకొచ్చాడు.
కథ వెంటనే నచ్చేసింది ఓకే చెప్పా.. రెండేళ్లలో కథను రెడీ చేసారు.. స్క్రీన్ ప్లే టైంలో మరోసారి నాకు స్టోరీ వినిపించారు అంటూ వివరించాడు. శేఖర్ కమ్ముల గురించి నాకు అసలు ఏమీ తెలియదు కానీ.. ఎవరికి ఆయన గురించి చెప్పినా వావ్ అని భయంకరమైన బిల్డప్ ఇచ్చేసారంటూ చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ సూపర్‌గా ఉందని పెద్ద డైరెక్టర్ అని నమ్మితే.. తీరా నన్ను తిరుపతి నడిరోడ్డుపై అమ్మ.. అమ్మ.. అంటూ బిచ్చం అడుకునేలా చేసాడు అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశాడు ధనుష్. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వే సారు. చాలా కాలం గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న కుబేర పై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. ఇందులో ధనుష్ బెగ్గర్‌గా కనిపించనున్నాడు. దాదాపు 3 గంటల నడివితో తెరకెక్కనున్న ఈ సినిమాను అమిగోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.