టాలీవుడ్ మోస్ట్ పాపులర్, సక్సెస్ఫుల్, క్రేజీ.. డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. దర్శక ధీరుడుగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రారంభంలో సీరియల్స్ దర్శకుడుగా వ్యవహరించారు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న జక్కన్న.. కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ధనుష్ తెరకెక్కించిన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ అందుకున్న జక్కన్న.. తన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్‌లో సూపర్ హిట్ గ్యారెంటీ అనే స్ట్రాంగ్ నమ్మకాన్ని బిల్డ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే.. ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా జక్కన్న.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక జంటగా నటించిన కుబేర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సందడి చేశాడు. ఇక ఈ ఈవెంట్‌లో శేఖర్ కమ్ముల, నాగార్జున, రష్మిక, ధనుష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించగా.. సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోని సుమా రాజమౌళి దగ్గరికి వెళ్లి ఆయన రెమ్యునరేషన్ గురించి ప్రశ్నలు సందించింది. మీ మొదటి రమ్యునరేషన్ ఎంత.. దాన్ని ఏం చేశారని ఆమె ప్రశ్నించగా.. వెంటనే రాజమౌళి దానిపై రియాక్ట్ అయ్యారు.
మొదట ఎడిటర్‌గా తను పనిచేశానని చెప్పుకొచ్చాడు రాజమౌళి. అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసే టైం లో నాకు రూ.50 జీతం ఇచ్చారని.. అదే నా ఫస్ట్ జీతం.. అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ డబ్బుతో ఏం చేస్తారు అని అడగగా.. నాకు అసలు గుర్తులేదు అంటూ వివరించాడు. వెంటనే సుమా ఆ టైంలో రమాగారు మీ దగ్గర లేరు.. కనుక ఆ డబ్బు కచ్చితంగా ఆమెకి ఇచ్చుండరు అంటూ సెటైర్ వేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి రెమ్యునరేషన్ వైరల్‌గా మారుతుంది. కేవలం రూ.50 రెమ్యునరేషన్‌తో జక్కన్న పని చేశాడా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆయన రేంజ్ కోట్లలో ఉందన్న సంగతి తెలిసిందే. కేవలం రెమ్యూనరేషన్ ఏ కాదు.. సినిమా లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నాడు. ఇలా ఒక్కో సినిమాకు హీరోల రేంజ్‌లో రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతుంది.