చిరు కెరీర్‌లో మూడుసార్లు నో చెప్పి.. నాలుగో సారి ఒప్పుకున్న పరమచెత్త డిజాస్టర్.. ఏదో తెలుసా..?

తెలుగులో సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని ముద్ర వేసుకున్న మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మల్లిడి వసిస్ట డైరెక్షన్‌లో విశ్వంభ‌ర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న చిరు.. అనిల్ రావిపూడితో మరో కామెడీ.. క్రేజీ ఎంటర్టైలర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో ఓ యాక్షన్ క్రైమ్ మూవీలో నటించనున్నాడు. ఇలా.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్న చిరు సైతం.. తన కెరీర్‌లో కొన్ని ప్లాన్‌ల‌ను చూశాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సందర్భాల్లో రాంగ్ డెసిషన్ తీసుకోక తప్పదు.

Megastar Chiranjeevi's Last 5 Movies: Box Office Collection Report –  FilmiBeat

ఈ క్రమంలోనే చిరంజీవి కెరీర్‌లోను ఆయన ఎంచుకున్న కథలతో పలు ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు. ఎంతో కాన్ఫిడెంట్గా హిట్ అవుతుందని.. నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీ కూడా వాటిలో ఒకటి. అయితే.. ఈ సినిమా విషయంలో చిరంజీవికి మొదటి నుంచి కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అని డౌట్ ఉండేదట. ఈ క్రమంలోనే ఒకటికి మూడుసార్లు కథను రిజెక్ట్ చేసుకోచ్చాడు. ఫైనల్ గా నాలుగవసారి మాత్రం డైరెక్టర్ చిరును కన్వీస్ చేసి.. సినిమాకు ఒప్పించాడు. వెంటనే చిరు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించాడు. అయితే ఈ సినిమా రిలీజై కెరీర్‌లోనే పరమ చెత్త డిసాస్టర్‌గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. చిరంజీవి హీరోగా, మహేష్ భార్య నమ్రత హీరోయిన్గా నటించిన అంజి.

Watch Anji (Telugu) Full Movie Online | Sun NXT

దాదాపు 20 ఏళ్ల క్రితం భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీకి.. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను అప్పట్లోనే భారీ గ్రాఫిక్స్‌తో హైలెట్ చేస్తూ రూపొందించారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కాకముందే ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. కానీ.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆడియన్స్‌ను మెప్పించ‌లేక‌బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కాగా.. మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఈ కథను నాలుగో సారి చిరంజీవి ఒప్పుకొని ఘోరమైన పరజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.