బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. కెరీర్లో అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో స్వతంత్రానికి ముందు కాలంలో సాగిన కథగా రూపొందనుంది. ఇక ప్రభాస్ ఓ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు టాక్.
హీరోయిన్గా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. నడుస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాలో మరో హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికీ అయినా షూట్లో సైతం పాల్గొని సందడి చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. రాహుల్ రవిచంద్రన్. రహుల్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నాడని సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు విశాల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటికే మూడు సాంగ్స్‌కు ట్యూన్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూట్ పూర్తి చేశాడు. త్వరలోనే ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను పలకరించనుంది. అంతేకాదు ప్రభాస్ ఫౌజి తర్వాత.. సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్స్‌లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్.. కెరీర్లోనే ఎన్నడు లేనివిధంగా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మరువనున్నాడు. హీరోయిన్గా బాలీవుడ్ యాక్టర్ త్రిప్తి దిమ్రి కనిపించనుంది.