పక్కలోకి వెళ్లాల్సిందే.. క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, నటిమ‌ణులు.. వాళ్లు ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంటునే ఉన్నారు. అలా ఒక‌ప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించి.. ఇప్పుడు కీలకపాత్రలో నటిస్తు మెప్పిస్తున్న రమ్యకృష్ణ సైతం తన కెరీర్‌లో క్యాస్టింగ్ కోచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో సౌందర్య, రోజా, మీనా లాంటి స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటుకుంది. అయితే.. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా.. రమ్యకృష్ణ సైతం క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందట. ఈ విషయాన్ని అందరూ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కెరీర్‌లో కొన్నేళ్లు హీరోయిన్గా టాప్ పొజిషన్లో రాణించిన రమ్యకృష్ణ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి మల్లి బాహుబలి తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. రమ్యకృష్ణ తోటి హీరోయిన్స్ అంతా ఇప్పటికీ చాలామంది ఖాళీ గానే ఉంటున్నారు. కానీ.. రమ్య‌కృష్ణ మాత్రం.. చేతినిండా సినిమాలతో.. పవర్ఫుల్ పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎంతోమంది ఈమెను కమిట్మెంట్ల కోసం ఇబ్బందులు పెట్టారట.

పక్కలోకి రావాలని డైరెక్ట్ గానే అడిగారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం చాలామంది ఆడపిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ చెప్పిన రమ్యకృష్ణ.. కొంతమంది దర్శక, నిర్మాతలు పక్కలోకి రావాలని అడుగుతారని ఇంటర్వ్యూలో ఓపెన్ కామెంట్స్ చేసింది. రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై ఇంత ఓపెన్ గా రియాక్ట్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. ఈమె పరిస్థితి ఇలా ఉందంటే.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టే కొత్త నటీనటుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ తల్లిగా, విలన్ గా, లేడి వారియంటెడ్ పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది.