టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. భారీ మార్కెట్ జరిగే సీజన్.. ఈ క్రమంలోనే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని.. దర్శక నిర్మాతల నుంచి.. స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సాధారణ రోజుల కంటే సంక్రాంతిలో తమ సినిమా రిలీజ్ చేస్తే లాభాల్లో దూసుకెళ్తుందని అంత నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నెలకొంటుంది. అలా తాజాగా 2026 సంక్రాంతి బరిలో దిగనున్న సినిమాల గురించి అప్డేట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం స్టార్ హీరోస్ మాత్రమే దృష్టి సారించే పొంగల్ డేట్లపై.. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం ఎగబడుతున్నారు.
ఈ క్రమంలోనే.. ఇప్పటికే 2026 సంక్రాంతి బరికి మెగా 157.. చిరు – అనిల్ కాంబినేషన్ మూవీ రావడం పక్కా అయింది. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా.. ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ బరిలో దించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించి సంక్రాంతి టార్గెట్‌గా పనులను శరవేగంగా ముగిస్తున్నారు. అయితే.. అదే డేట్‌కు మరో సీనియర్ హీరో బాలయ్య సినిమా కూడా బరిలో దిగే అవకాశం ఉంది. బాలయ్యకు మొదటి నుంచి సంక్రాంతి సెంటిమెంట్. ఈ క్రమంలోనే మొదట దసరా బరిలో రిలీజ్ చేయాలనుకున్ఏన ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది. లేకపోతే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక బాలయ్య రికార్డుల లిస్ట్ కూడా ఈ రిలీజ్ డేట్ మార్పుకు మరో ప్రధాన కారణం అని టాక్. అంతేకాదు.. డార్లింగ్ ప్రభాస్ కూడా పొంగల్ డేట్స్ పై దృష్టి సారించినట్లు సమాచారం. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న రాజాసాబ్‌ను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట టీం. ఇప్పటివరకు రిలీజ్ డేట్ లాక్ చేయకపోయినా దాదాపు సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ యంగ్ హీరో అడుగుపెట్టాడు. అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ పోలిశెట్టి సంక్రాంతి బరిలో దిగనున్నాడు. ఇలా టాలీవుడ్ లో ఆరు నెలలకు ముందు నుంచే వచ్చేయడాది సంక్రాంతి డేట్స్ కోసం పోటీ మొదలైపోయింది. ఇక చివరికి వచ్చేసరికి రేసులో మరెన్ని సినిమాలు యాడ్ అవుతాయో వేచి చూడాలి.