RRR 2 చేస్తారా.. ఉపాసన ప్రశ్నకు రాజమౌళి ఇంట్రెస్టింగ్ ఆన్సర్..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆర్‌ఆర్ఆర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆస్కార్‌ను సైతం దక్కించుకున్న ఈ సినిమా లైవ్ కాన్సెప్ట్ తాజాగా లాండన్‌లో గ్రాండ్‌గా జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో జక్కన్నతో పాటు చరణ్ పాల్గొని సందడి చేశారు. రాయల్ అల్బ‌ర్ట్ హాల్లో ఆర్‌ఆర్ఆర్ సినిమా లైవ్ కాన్సర్ట్‌ ప్రీమియం ప్రదర్శనకు జనం వెల్లువెత్తారు. ప్రపంచ వేదికపై ఆర్‌ఆర్ఆర్ సినిమాకు మరో గౌరవం దక్కింది. ఇక్కడ తారక్, చెర్రీ ఇద్దరు ఫ్యామిలీతో కలిసి లండన్ లో సందడి చేశారు.

Ram Charan's early birthday wish for JR NTR at RRR event wins hearts, watch video

ఈ క్రమంలోనే జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల వీడియోస్ ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటన్నింటిని చూస్తున్న ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అలాంటిదే మరో క్రేజీ వీడియో తాజాగా వైరల్ గా మారుతుంది. చరణ్ సతీమణి ఉపాసన స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఎప్పటిలాగే చరణ్, తారక్ ఇద్దరు రాజమౌళిని ఆటపట్టిస్తూ కనిపించారు. ఇక వీళ్లిద్దరూ అల్లరిని జక్కన్న భరించలేకపోతుండడం.. వీడియో చూసే ఆడియన్స్ కు ఎంతో సరదాగా అనిపించింది.

Rajamouli Says He will make Sequel To RRR NTR Ram Charan Enjoying In RRR Live Concert Know more details | Rajamouli: రాజమౌళి సార్ 'RRR 2' మూవీ తీస్తారా? - క్లారిటీ ఇచ్చేసిన దర్శక ధీరుడు

ఇక అక్కడే ఉన్న ఉపాసన.. జక్కన్నను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. రాజమౌళి ఇప్పుడు చెప్పండి.. మీరు ఆర్ఆర్ఆర్2 చేస్తారా అని ప్రశ్నించగా.. దానికి రాజమౌళి ఎస్ అంటూ రియాక్ట్ అయ్యారు. వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్స్ యూ అంటూ కామెంట్స్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఆర్‌ఆర్ఆర్2 ఉంటుందని రాజమౌళి సరదాగా చెప్పినా.. నిజంగానే ఆయన మైండ్‌లో సీక్వెల్ కు ఆలోచన ఉందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే.. మరోసారి ఆర్‌ఆర్ఆర్ 2 చర్చ ఫ్యాన్స్‌లో తెగ వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)