వార్ 2: టీజర్ రెస్పాన్స్ లేదన్నారు.. ఈ రికార్డ్‌లు చూస్తే దెబ్బకు నోళ్ళు మూస్తారు..!

టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ దక్కించుకుని దూసుకుపోతున్న హృతిక్ రోషన్.. కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మే 20న తార‌క్ బ‌ర్త‌డే సెలబ్రేష‌న్స్‌లో భాగంగా సినిమా నుంచి గ్రాండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్‌కు విడుదలైన 24 గంటల్లోనే భారీ లెవెల్ లో వ్యూస్, లైక్స్ వస్తాయని అంతా భావించారు.

కానీ.. కనీసం ప్రాంతీయ భాష సినిమాలకు వచ్చిన రేంజ్‌లో రెస్పాన్స్ కూడా ఈ సినిమాకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. కానీ.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. నిజంగా ఈ న్యూస్ తారక్ ఫ్యాన్స్‌కు పండగ చేసుకునే న్యూస్ అనడంలో సందేహం లేదు. ఇక వార్ 2 టీజర్ రిలీజ్ అయినా 125 గంటల వరకు యూట్యూబ్లో టాప్ రన్నింగ్‌లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగి సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలోనే మూవీ టీజర్‌కు సరైన రెస్పాన్స్ ఏ లేదు. మూవీ తెలుగు వర్షన్ టీజర్ అసలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదంటూ విమర్శలు చేసిన వారంతా.. ఈ టీజర్ ఏకంగా 125 గంటల పాటు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉందని వార్త తెలియడంతో షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.