బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోలు అవకాశాలు దక్కించుకోవడం.. అక్కడ మన స్టార్ హీరోస్ కు ప్రామినెంట్ రోల్స్ రావడం అనేది చాలా కష్టతరం. అలాంటిది బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై.. అది కూడా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి నటించే.. సూపర్ డూపర్ జాక్పాట్ కొట్టేశాడు తారక్. అదే వార్ 2 మూవీ. ఈ సినిమాలో మొదట తారక్‌ను సెలెక్ట్ చేసుకోవడంపై అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందీ సినిమాల్లో మన టాలీవుడ్ హీరో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
అయితే ఇప్పటివరకు క్యారెక్టర్ పై వస్తున్న ప్రశ్నలన్నింటికీ.. నేడు ఆన్సర్ దొరికేసింది. చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చే రేంజ్‌లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. నేడు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక వార్ 2 తారక్ కెరీర్‌లోనే మొట్టమొదటి బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ఇక ఈ సినిమా టీజర్ చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కు గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా క్లిప్ ఉంది.
నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెతుకుతున్నాయి కబీర్.. ఇండియన్ బెస్ట్ సోల్జర్.. రాల్ బెస్ట్ ఏజెంట్ నువ్వే.. కానీ ఇప్పుడు కాదు. నా గురించి నీకు తెలియదు అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తనకి తగ్గ విజువల్స్‌తో ఆకట్టుకుంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ లుక్ మెస్మరైజింగ్ అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ అదరగొట్టారు. సినిమా ఆర్ఆర్ వేరే లెవెల్‌లో డిజైన్ చేసినట్లు అనిపించింది. ఇక టీజర్‌తో అడియన్స్‌లో మరిని అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే టీజర్ చూసిన ఆడియన్స్ ధియేటర్స్ బ్టాస్ట్ పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.