లక్ష్మీ ప్రణతి పై ఉపాసన అలాంటి కామెంట్స్.. మనసులో ఇంత పెట్టుకుందా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఈ సినిమా కంటే ముందే చాలా మంచి ఫ్రెండ్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఎప్పుడైతే కలిసి స్క్రీన్ లో షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లు ఇద్దరు ఫ్యామిలీలతో సహా మరింత క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోలు భార్యలతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేసిన‌ సందర్భాలు ఉన్నాయి. అలా.. తాజాగా మేడమ్ టుసాడ్స్‌లో రామ్ చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన టైం లో కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్కడ సందడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా చరణ్.. ఎన్టీఆర్ తమ కుటుంబంతో సహా రాయల ఆల్పట్ హాల్లో జరిగిన ఆర్‌ఆర్ఆర్ క‌న్స‌ర్ట్‌ ఈవెంట్ కు కూడా హాజరయ్యారు.

Jr NTR Wife lakshmi pranathi surprise gift to Upasana||Lakshmi pranathi,upasana cute video - YouTube

ఇందులో.. చరణ్ సతీమణి ఉపాసన.. ఎన్టీఆర్ సతిమణి లక్ష్మీ ప్రణతి పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు ఉపాసన మాట్లాడిన మాటలు నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి. ఉపాసన ఆ ఈవెంట్లో మాట్లాడుతూ.. ప్రణతి నాకంటే వయసులో చాలా చిన్నదైనా కూడా.. అన్ని విషయాలను చాలా సులువుగా మేనేజ్ చేయగల సత్తా ఆమెలో ఉంది. నేను లేనప్పుడైనా నా ఇంటిని బ్యాలెన్స్గా మేనేజ్ చేయగలదు. సైలెంట్ గా ఉంటుంది కానీ.. చాలా టాలెంటెడ్. చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు లక్ష్మీ ప్రణతి స్వీట్ పర్సన్.. ఇలాంటి ఒక మంచి భార్యను పొందడం ఎన్టీఆర్ అదృష్టం అంటూ ఉపాసన కామెంట్స్ చేసింది.

NTR Celebrates Ram Charan Birthday | Jr NTR, Pranathi | Ram Charan, Upasana | SS Rajamouli | #RRR - YouTube

ప్రస్తుతం లక్ష్మీ ప్రణాతి పై ఉపాసన చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఉపాసన ఈ క్రమంలోనే చరణ్ భార్య ఉపాసన కు.. లక్ష్మీ ప్రణతి అంటే ఇంత ప్రేమ ఉందా.. లోపల ఇన్ని రోజులు ఇంత ప్రేమను దాచుకుందా అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ టైంలో ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చూపించారంటూ నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నందమూరి, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ కూడా కొనసాగుంది. అయితే.. హీరోల అభిమానులు ఎంత‌ కొట్టుకున్న.. సెలబ్రెటీస్ మాత్రం అంతా ఒకటేనని మరోసారి ఉపాసన కామెంట్స్‌తో ప్రూవ్ అయింది.