గతంలో రొమాన్స్ చేసిన హీరోకు తల్లి పాత్రలో త్రిష.. ఏ మూవీ అంటే.. ?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్‌లో త్రిష కృష్ణన్‌ పేరు క‌చ్చితంగా వినిపిస్తుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన్న త్రిష.. కెరీర్ స్టార్టింగ్‌లో ఎంత అందంగా ఉండేదో.. అంతకు మించిన అందం, గ్లామర్ ట్రీట్‌తో ఇప్పుడు కుర్రకారును కట్టిపడేస్తుంది. అప్పట్లో ఎలా అయితే స్టార్ హీరోల సినిమాల్లో వరస అవకాశాల‌ను దక్కించుకుని సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుందో.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో రాణిస్తుంది. అల్లు అర్జున్, చరణ్ త‌ప్ప‌.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లోని నటించిన ఈ అమ్మడు.. ఆన్ స్క్రీన్‌లో ఏ హీరోతో కనిపించినా.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా కనిపిస్తుంది. కాగా.. ఇలాంటి నేప‌ద్యంలో త్రిషకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

Vinnaithaandi Varuvaayaa (2010) | Vinnaithaandi Varuvaayaa Tamil Movie |  Movie Reviews, Showtimes | nowrunning

ఒకప్పుడు తను రొమాన్స్ చేసిన స్టార్ హీరోకు ఇప్పుడు తల్లిగా త్రిషా కనిపించనుందంటూ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమే. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో సింబు. గతంలో సింబూతో త్రిష మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. అందులో వినైతాండి వరువాయా సినిమా కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ అందుకుంది. నాగ‌ చైతన్య, సమంత జంటగా నటించిన ఏం మాయ చేసావే సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాల్లో సింబు, త్రిష తో చేసిన రొమాన్స్ అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అలాంటి ఈ క్రేజీ కపుల్ తల్లి, కొడుకుల పాత్రలో కనిపిస్తారని అసలు ఎవరు ఊహించలేరు.

Thug Life: The Ultimate Faceoff Between Kamal Haasan and Simbu -  TrackTollywood

కానీ.. ఇప్పుడు అదే జరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. కమలహాసన్ న‌టించిన‌ థగ్ లైఫ్ వ‌చ్చే నెల 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌కు భార్య‌గా త్రిషా మెరుస్తుంది. ఇందులో సింబు.. కమల్ హాసన్ కొడుకు పాత్రలో నటించనున్నాడు. తండ్రి కొడుకులు మధ్య జరిగే క్లాష్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజై.. అద్భుతమైన రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇక ట్రైలర్లో త్రిష, కమల్ హాసన్ జంటగా మెరవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. కమల్ హాసన్ కు జంటగా అంటే.. సింబుకి తల్లి అన్నట్లే లెక్క. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.