రజనీ ” కూలీ ” రైట్స్ కోసం టాలీవుడ్ లో టఫ్ కాంపిటీషన్.. రంగంలోకి ఆ స్టార్ హీరో..!

కోలీవుడ్ త‌లైవా రజినీకాంత్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆరుపదల వయసులోనూ తన ఎనర్జిటిక్ లుక్స్‌తో.. స్టైల్, యాటిట్యూడ్‌తో కుర్ర‌కారును ఫిదా చేస్తున్నాడు రజినీకాంత్. ఈ క్రమంలోనే.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న ఆయన.. కలెక్షన్ల పరంగాను సంచలనాలు సృష్టిస్తున్నాడు. చివరగా జైలర్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించి స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇచ్చిన రజినీ.. తర్వాత పలు సినిమాలో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయినప్పటికీ.. రజనీకాంత్ క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో.. రజినీకాంత్ నటించిన కూలీ సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది.

ర‌జ‌నీ కాంత్ ' కూలీ ' హ‌క్కులకు తెలుగులో ఇంత పోటీయా... టాలీవుడ్ స్టార్ హీరో  కూడా ఖ‌ర్చీఫ్‌...! - Telugu Lives

కాగా.. ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. దీనికి పోటీగా రజనీకాంత్ కూలీ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. అయినప్పటికీ కూలీ సినిమాకు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ నెల‌కొంది. ఎప్పుడైతే జైలర్ గ్రాండ్ లెవెల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో.. దాని ప్రభావం కూలి తెలుగు రైట్స్ విష‌యంలో సైతం కనపడుతుంది. ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏ క్రమంలోనే కూలీ తెలుగు హక్కుల కోసం ఇప్పుడు ఏషియన్స్ సునీల్‌తో పాటు.. మరో ఇద్దరు స్ట్రాంగ్ డిజిటబ్యూటర్స్ కూడా పోటీకి దిగుతున్నారట. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సైతం ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం ఖర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ నటించిన తలైవర్ 171కి కూలీ టైటిల్! తమిళ సినిమా, సంగీత సమీక్షలు  మరియు వార్తలు

అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తన కూలి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున. అలాగే.. దిల్ రాజు సైతం కూలి హక్కుల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో సినిమా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన సూర్యదేవర నాగవంశీ.. కూలీ హక్కులను టార్గెట్ చేశారని.. ఆయన ఈ రైట్స్ కు రూ.42 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జైల‌ర్ కలెక్షన్లు దృష్టిలో పెట్టుకొని.. నాగ వంశీ ఈ రేంజ్‌లో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాడట. ఇక లోకేష్ కనకరాజ్‌కు సైతం టాలీవుడ్‌లో స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే రజిని, లోకేష్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో.. కూలీ సినిమా పై ఆడియన్స్ లో మంచి హైప్ నెల‌కొంది. ఈ సినిమా సక్సెస్ కొట్టడం ఖాయం అంటూ నమ్మకాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా తెలుగు రైట్స్.. చివరకు ఎవరు దక్కించుకుంటారు వేచి చూడాలి.