టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. నాగచైతన్య గత ఏడాది శోభితను వివాహం చేసుకుని సంతోషంగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టడు. మరోపక్క పెళ్లి తర్వాత హీరోగా నటించిన తండేల్ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక సమంత కూడా తన లైఫ్ లో బిజీగా రాణిస్తుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరోపక్క నిర్మాతగా మారి శుభం సినిమాను రూపొందించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక విడాకుల తర్వాత ఇద్దరు పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే నాగచైతన్యకు.. సమంత గురించి ఏదైనా ప్రశ్న ఎదురైనా.. ఆమె గురించి గొప్పగా మాట్లాడుతూ.. మా విడాకులు దురదృష్టకరమని చెబుతూ వచ్చాడు.
ఇక సమంత మాత్రం.. నాగచైతన్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. అతని పేరు ఎత్తకుండానే సీరియస్‌గా రియాక్ట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు సున్నితంగా సమాధానం వచ్చేది కాదు. అతను, నేను ఇప్పుడు ఒకే గదిలో ఉండే పరిస్థితి వస్తే.. ఆ గదిలో ఎలాంటి ప్రాణహాని కలిగించే వస్తువులు ఉండకూడదని నేను కోరుకుంటా.. ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు.. అంటూ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మండిపడింది. విడాకుల తర్వాత సమంత, అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో.. అక్కినేని అఖిల్‌కు మాత్రం.. ఈమె చాలా సందర్భాల్లో పుట్టినరోజు విషెస్ తెలియజేసింది. అయితే.. తాజాగా అక్కినేని ఫ్యామిలీ, సమంత ఒకే ఈవెంట్లో పాల్గొనే సందర్భం వచ్చింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. తాజాగా.. జీ తెలుగు అవార్డ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేసింది.
ఈ అవార్డ్ ఫంక్షన్ కు పలువురు స్టార్ సెలబ్రెటీలతో పాటు.. సమంత, అక్కినేని అమలా సైతం హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమంతకు జీ తెలుగు అవార్డ్‌ను అందించగా.. అమలా.. గత 30 సంవత్సరాల నుంచి జంతు సంరక్షణ చేపట్ట కార్యక్రమాలు చేస్తున్నందుకు స్పెషల్ అవార్డును పురస్కరించారు. కాగా.. సమంతా అవార్డు అందుకునే నేపథ్యంలో స్టేజ్ పై మాట్లాడుతూ ఎమోషనల్ స్పీచ్ ఇస్తుండగా.. అమల సైతం చప్పట్లు కొడుతూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మాజీ అత్త.. మాజీ కోడలు ఒకే ఈవెంట్లో కనిపించడం.. సమంత స్పీచ్‌కు.. అమల క్లాప్స్ కొడుతూ హ్యాపీగా మెరవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ.. వీళ్లు కలుసుకొని మాట్లాడుకున్నారా.. లేదా.. అనేది మాత్రం క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.