రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్.. డైరెక్టర్ వైఫ్ షాకింగ్ పోస్ట్..!

స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా డైరెక్టర్ రాజ్ నిడ‌మొరుతో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా సమంత రాజ్‌తో కలిసి క‌నిపించ‌డంతో ఈ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా సమంత తన సినిమా ప్రమోషన్స్ కోసం తిరుమలకు వెళ్ళగా.. అక్కడకు కూడా రాజ్‌ నిడమూరు వెళ్లారు. అలాగే.. సినిమా ప్రమోషన్స్ లో ప్రతి చోట రాజ్ నిడ‌మొరుతో సమంత మెరిసింది. అలాగే.. తన ఇంట్లో కూడా రాజునిడమోరుతో ఉన్న ఫోటోలను అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఆ ఫొటోస్ తెగ వైరల్ గా మారాయి.

Is Samantha Ruth Prabhu dating director Raj Nidimoru? | Filmfare.com

ఇంతగా చట్టపట్టలేసుకొని తిరుగుతున్న సరే.. తమ మధ్య ఉన్న రిలేషన్ను మాత్రం సమంత ప్రశ్నార్థకంగానే ఉంచేసింది. అయితే విళ్ల‌ రిలేషన్షిప్‌పై క్లారిటీ ఇవ్వకున్నా.. లైఫ్ ని మాత్రం తెగ ఎంజాయ్ చేసేస్తుంది. ఈ క్రమంలోనే సమంత నిజంగానే రాజ్‌తో డేటింగ్ చేస్తుందా.. లేదా అది ఫ్రెండ్షిప్ మాత్ర‌మేనా అనే సందేహాలు అంద‌రిలో మొద‌ల‌య్యి. దీనిపై క్లారిటీ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్‌ నిడమొరు భార్య సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్‌ను షేర్ చేసుకుంది. రిలేషన్ గురించి రాజ్ భార్యా శ్యామలా దే షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

Samantha Ruth And Raj Nidimoru's Dating Rumours: Meet Citadel Director's Wife, Shhyamali De And Kid

ఇంతకీ రాజ్ భార్య‌ పెట్టిన ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్ నిడమోరు భార్య శ్యామలా దే తన సోషల్ మీడియా ఖాతాలో నాకోసం మాట్లాడేవారు.. చదివే వారు.. వినిపించే వారిని నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. నా ఆశీర్వాదాలు ఎప్పటికీ వారికి అందుతూనే ఉంటాయి అంటూ షేర్ చేసుకుంది. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు.. రాజ్ నిడమోరు.. సమంతా డేటింగ్ వార్తలను నేపథ్యంలో.. సమంత కారణంగా రాజ్ నిడమోరు తన భార్యకు దూరమయ్యాడని.. ఆమెకు మద్దతుగా కొన్ని వార్తలు ప్రచురించారు. ఈ క్రమంలోనే ఆమెకు మద్దతుగా వార్తలు రాసే వారిని ఉద్దేశిస్తూ శ్యామలా దే ఇలాంటి పోస్ట్ షేర్ చేసుకుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.