పెద్ది vs డ్రాగన్.. వార్‌లో విన్న‌ర్ ఎవ‌రంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం డామినేట్ చేస్తున్న మన టాలీవుడ్ సినిమాలతో సక్సెస్ అందుకోవడమే కాదు.. ఎన్నో వండర్స్ ను సైతం క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి తో పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీకి టాలీవుడ్ ను పరిచయం చేశాడో.. అప్పటినుంచి పాన్ ఇండియన్ సినిమాల పరంపర మొదలైపోయింది. స్టార్ హీరోలు అందరూ వరుసగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు నటిస్తూ మంచి సక్సెస్‌లు అందుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. ఈ సినిమా గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాడు.

Ram Charan's 'Peddi' poster drops: First glimpse video set for Ram Navami!

దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ మరింతగా పుంజుకున్నాయి. అంతేకాదు.. చివరగా చ‌ర‌ణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో.. ఈ పెద్ది సినిమాతో చరణ్ స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వబోతున్నాడు అంటూ అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదేమైనా చరణ్ రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటాడో వేచి చూడాలి. ఎన్టీఆర్ మాస్‌ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నాడు. కెరియర్ మొదట్లో ఆది, సింహాద్రి లాంటి రెండు భారీ బ్లాక్ బాస్టర్లు అందుకున్న తారక్.. మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటికి తన నటన పరిణితిని చాటుతూ యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనలాంటి నటుడు మరెవ్వరూ ఉండరు అనేంతలా సత్తా చాటుకున్నాడు.

Jr NTR-Prashanth Neel's untitled film rumoured to be a standalone film

ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేసి చూపించే కెపాసిటీ ఉన్న నటలలో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. కాగా.. డ్రాగన్ సినిమాకు పెద్ది మూవీకి మధ్య తీవ్రమైన పోటీ నెలకొలనుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అందుకుంటుంది.. ఏ స్టార్ హీరో ఈసారి బరిలో సక్సెస్ అందుకొని మరింతగా మార్కెట్ క్రియేట్ చేసుకుంటారని చెర్చలు హాట్‌ టాపిక్‌గా మారాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఇద్దరు స్టార్ హీరోలను మించిన వారు మరొకరు లేరు అనేంత‌లా.. రెండు సినిమాలు మధ్యన సక్సెస్ టాపిక్ వైరల్ అవుతుంది. ఇక ఇద్దరు హీరోల్లో ఎవరు సక్సెస్ అందుకునే టాప్ పొజిషన్లో నిలుస్తారో తెలియాలంటే మాత్రం రెండు సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.