టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నా ఆయన.. 2024 కంటే ముందే సైన్ చేసిన సినిమాలను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా జూన్ 12న.. ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ అవుతున్న నేపద్యంలో.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేస్తున్నారు టీం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. సినిమాలో చాలా బాగం డూప్‌తో మేనేజ్ చేసేసారు అంటూ రూమర్లను తెగ స్ప్రెడ్ చేసి.. పవన్ ఇమేజ్ను దెబ్బ తీసే ప్లాన్ చేశారు యాంటీ ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ డూప్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఫుల్ క్లారిటి ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు. హరిహర వీరమల్లు సినిమా షూట్ టైంలో ఓ సన్నివేశం జరుగుతుంది. అది అక్బర్, బాబర్ కాలం నాటికీ సంబంధించిన సీన్. సెట్ మొత్తం వేసేసారు. పెద్దపెద్ద గుర్రాలను కూడా తీసుకోవచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సీన్‌కు తగ్గట్లుగా బ్లాక్ కలర్ పంచకట్టులో సెట్స్‌లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కింద నుంచి గుర్రం మీద ఉండే విలన్‌ను ఎగిరి తన్నాలి. అయితే.. ఆ షార్ట్ కోసం మాస్టర్స్ పవన్ గారిని మీరు జస్ట్ కాలు ఇలా అనండి.. మేము డూప్ వేసుకొని చేసేసుకుంటాం అని వివరించారు. అందుకు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోలేదంటూ చెప్పుకొచ్చాడు.
ఆయనే సీన్ స్వయంగా చేశాడని.. అయితే ఈ షార్ట్ చేసే టైంలో తన కాలు ఎక్కడో పట్టేసింది.. అయినా కానీ వెనకడుగు వేయకుండా షాట్ ఓకే అనంత వరకు రిపీటెడ్ గా చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇక షార్ట్ ఓకే అని డైరెక్టర్ చెప్పినా.. కళ్యాణ్ బాబుకు ఆ షార్ట్ నచ్చలేదు. మరొకటి తీసుకుందామని పక్కకు వెళ్లి కాస్త స్ప్రే చేసుకుని వచ్చి మరి ఆ షాట్ ను కంప్లీట్ చేశాడు.. ఆయనకు సినిమా పట్ల ఉన్న డేడికేషన్ అది అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ డూప్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి షూటింగ్లో పాల్గొన్నారు అంటూ పవన్ కళ్యాణ్ డూప్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ పవన్ ను విమర్శించి.. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారందరికీ చెంపపెట్టుగా నిలిచాయి.
Pk Dupe❌
PK original stunts✅
No dupe Use’s in @PawanKalyan #HHVM lo dupes Use Chesadu, ani morigina kukkalu itu Randra…………..#HariHaraVeeraMallu pic.twitter.com/J3bK1fi1ox— AttiTudE mAsTeR #OG🚬 (@KalyanFanatics) May 29, 2025