టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సినిమా షూట్‌ని ఎట్టకేలకు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అమెజాన్ ప్రైమ్ డీల్ కూడా క్లోజ్ అయిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120 కోట్లకు ఈ డీల్ లాక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ కట్ విషయంలో పనిచేస్తున్న టీం.. రిలీజ్ డేట్‌ని త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారు. మొదట సినిమా మే 30న రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపించినా.. తర్వాత జూన్ 12 కు వస్తుందంటూ టాక్ నడిచింది. కానీ.. ఇప్పుడు ఈ రెండు డేట్స్‌లో రిలీజ్ కావడం లేదని.. నిర్మాత ఏఏం రత్నం ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట.
దానికి సంబంధించిన అన్ని చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. అదే రోజున మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో జూన్ 27 కు వాయిదా వేశారు. ఇక పవన్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజున కన్నప్ప లాంటి సినిమాను రిలీజ్ చేయడం అంటే.. అది విష్ణుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఆ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే మాత్రం కన్నప్ప సినిమాకు నష్టం తప్పదు. ప్రభాస్ ఈ సినిమాలో ఉన్న కారణంతో అడపాదడపా కలెక్షన్లు రావచ్చు కానీ ఉహించిన రేంజ్ కలెక్షన్‌లు మాత్రం రావు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. కన్నప్ప పెద్ద సినిమానే. ఈ సినిమా కోసం రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశాడు విష్ణు.
ఈ నేపథ్యంలోనే సినిమాకు థియేటర్ల కొరత అయితే ఉండదు. ఒకవేళ నిజంగానే హరిహర వీరమల్లు సినిమాను పవన్.. విష్ణు – కన్నప్పకు పోటీగా రిలీజ్ చేస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ ఊహించిన రేంజ్ లో వీరమల్లుకు కూడా కలెక్షన్స్ రావు. ఇక ఎలాంటి క్లాసెస్ ఉండకూడదు అంటే.. కన్నప్పను వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే పవన్ ఏపి డిప్యూటీ సీఎం. సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉన్న నేపథ్యంలో.. కనప్పకు ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచాలన్న.. మరి ఇతర బెనిఫిట్స్ కోసమైనా పవన్ కళ్యాణ్ అవసరం ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమా విష్ణు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి పవన్ సినిమా డేట్ ను మార్చుకుంటాడా.. లేదా కన్నప్ప రిలీజ్ రోజునే విరమల్లు రిలీజ్ చేసి విష్ణుకు సవాల్ విసురుతాడా వేచి చూడాలి.