నాగార్జున సినిమాల్లో ధనుష్ కు ఆ అట్టర్ ప్లాప్ మూవీ అంత ఇష్టమా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో కుబేర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా మెరువనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్వి, అమీటోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జిమ్మీ సర్బ్, దిలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు.. తమిళ్, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Nagarjuna new movie cheap

ఈ క్ర‌మంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. మేకర్స్‌ ప్రమోషన్స్‌లో జోరు పెంచనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో ధనుష్ పాల్గొని సందడి చేశాడు. నాగార్జున పై తనకున్న అభిమానాన్ని షేర్ చేసుకున్న ధ‌నుష్‌.. కుబేరాలో నాగ్‌తో కలిసి యాక్ట్‌ చేసిన అనుభవం ఎంతో ఆనందకరమని వెల్లడించాడు. షూటింగ్ టైంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని.. నా లైఫ్‌లో ఎప్పటికీ ఆ పాఠాలు గుర్తుండిపోతాయంటూ వెల్లడించాడు.

Watch Rakshakudu (1997) (Telugu) Full Movie Online | Sun NXT

చిన్నప్పటి నుంచి నేను నాగార్జున సినిమాలకు పెద్ద ఫ్యాన్.. ఆయన నటించిన మూవీస్‌లో రాక్షసుడు మూవీ నాకు చాలా ఫేవరెట్ అంటూ ధనుష్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. కాగా.. ప్రవీణ్ గాంధీ డైరెక్షన్‌లో 1997లో వ‌చ్చిన రాక్షసుడు మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది. అప్పట్లో మిస్ యూనివర్స్ అందల పోటీ విజేత‌ సుస్మితసేన్ హీరోయిన్గా మెరిసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియన్స్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర డీల పడింది. అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ధ‌నుష్ ఫేవరెట్ మూవీ రాక్షసుడు అని చెప్పడంతో నాగార్జున ఆట్ట‌ర్ ఫ్లాప్‌ మూవీ ధనుష్‌కు అంత ఇష్టమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.