ఏకంగా 1500 సార్లు టీవి టెలికాస్ట్ అయినా మహేష్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటివరకు సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న జక్కన్న.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 తో గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే స్టోరీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు.

Athadu - Wikipedia

ఇప్పటికే సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. ఇక సినిమాలో మహేష్ కు జంటగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మెరవనుంది. కాగా మహేష్ ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియన్ సినిమా కూడా నటించకపోయినా.. ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలు థియేటర్లోనే కాదు.. బుల్లితెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంటాయి. కొన్ని సినిమాలు ధియేటర్లలో ఊహించిన సక్సెస్ అందుకోకపోయినా.. టీవీలో మాత్రం భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. అలాంటి వాటిలో మహేష్ నటించిన ఓ సినిమా ఏకంగా టీవీలో 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సంచలనం సృష్టించింది.

Athadu Telugu Movie | Avunu Nijam Full Song | Mahesh Babu, Trisha - YouTube

సాధారణంగా.. థియేటర్‌ల‌లో సూపర్ హిట్లుగా నిలిచిన ఏ సినిమా అయినా.. వేయిసార్లు టెలికాస్ట్ అవ్వడం కూడా చాలా కష్టం. అలాంటిది మహేష్ బాబు నటించిన ఓ సినిమా థియేటర్లో ప్లాప్ అయినా.. టీవీలో మాత్రం ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు అతడు. ఈ సినిమా గతంలో ప్రతి ఆదివారం ఏదో ఒక చానల్లో టెలికాస్ట్ అవుతూనే ఉండేది. కాగా.. కేవలం స్టార్ మా లోనే అతడు సినిమా ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ కావడం సెన్సేష‌న‌ల్ రికార్డ్‌.