ఫ్యాన్స్ కు చిరంజీవి మైండ్ బ్లోయింగ్‌ ట్విస్ట్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మ‌ల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. uv క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా మెరువనుంది. ఆషికా రంగనాథ్‌, ఇషా చావ్లా ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు నిరాశ మిగులుస్తూ రిలీజ్ డేట్‌ను లేట్ చేస్తూనే వస్తున్నారు మేకర్స్. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని టాక్ వినిపించిన గేమ్ ఛేంజర్‌ సినిమా కోసం దానిని వాయిదా వేశారు.

Anticipating Vishwambara's First Look?"

కాగా సినిమా పూర్తయిందని మేకర్స్ వెల్లడిస్తూనే.. విఎఫ్ఎక్స్ పని ఇంకా ఉందంటూ రిలీజ్ డేట్ బ్లాక్ చేస్తూ వస్తున్నారు. విశ్వంభర గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్న నేపథ్యంలో.. విఎఫ్‌ఎక్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా డిజైన్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో విశ్వంభ‌ర గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే సినిమా విఎఫ్ఎక్స్ పూర్తయి ఏడాదిలో సినిమా రిలీజ్ అవ్వడం కష్టమంటూ టాక్‌ నడుస్తుంది. ఇలాంటి క్రమంలో మెగాస్టార్ 157వ సినిమా సెట్స్‌లో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

Mega 157: షూటింగ్‍కు ముందే చిరంజీవితో ప్రమోషన్లను మొదలెట్టేసిన అనిల్  రావిపూడి.. వీడియో అదుర్స్.. చూసేయండి-mega 157 anil ravipudi introduces team  to chiranjeevi in ...

ఈ క్రమంలోనే విశ్వంభర సినిమా రిలీజ్ అయినా.. అవ్వకపోయినా.. 2026 సంక్రాంతి బరిలో మెగా 157 మాక్సిమం ఉంటుందంటూ సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియని పరిస్థితి. విశ్వంభ‌ర, అనిల్ రావిపూడి సినిమా ఈ రెండిటి మీద మెగాస్టార్ మాత్రం పూర్తి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వంభ‌ర కంటే ముందే మెగా 157 రిలీజ్ అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉందంటూ టాక్ వైర‌ల్ అవ్వ‌డంతో ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య పోతున్నారు.