ఆ తమిళ్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాల లైనప్‌తో యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి డైరెక్షన్‌లో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా తర్వాత క్రిష్ కాంబినేషన్లో ఇంకో సినిమా ఫిక్స్ అయిందని టాక్. ఇక ఈ సినిమాతోనే మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట.

The massive combo Balayya- Boyapati is back with 'Akhanda 2 – Thandavam'

అంతేకాదు.. అనిల్ రావిపూడితోను బాలయ్య సినిమా నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో బాలయ్య లైన్లో మరో క్రేజీ డైరెక్టర్ చేరాడు అంటూ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. అతను టాలీవుడ్ దర్శకుడు కాకపోవడం విశేషం. బాలయ్య ఓ తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. అధిక్‌ రవిచంద్రన్ అని తెలుస్తుంది. బాలయ్య అతనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.

Balakrishna to collaborate with director of Tamil blockbuster: Reports

బాలయ్య, అధిక్‌ రవిచంద్రన్ కాంబోలో సినిమా ఫిక్స్ అయితే మాత్రం ఈ సినిమా తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పట్టనుందని టాక్‌. ఇక బాల‌య్య‌ తన రెమ్యూనరేషన్ సైతం మెల్ల మెల్లగా పెంచుకుంటూ వస్తున్నారు. సీనియర్ హీరోల్లో రూ.40 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య.. రాబోయే రోజుల్లో రూ.50 కోట్లు మార్క్‌ను కూడా క్రాస్ చేస్తే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలకు సైతం బాలయ్య ఎన్నో విషయాల్లో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఫాన్స్‌కు మరింత దగ్గరవుతున్న ఈయన.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు.. బుల్లితెరపై, మ‌రోవైపు రాజకీయాల్లోనూ సక్సెస్‌ఫుల్గా రాణిస్తున్నాడు. తన కెరీర్‌ను మరింత అద్భుతంగా మలుచుకుంటున్నాడు.