టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇప్పటికే ఎన్నో సెన్సేషనల్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తో నటన పరంగానే కాదు కలెక్షన్ల పరంగాను సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తాజాగా బన్నీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరింది అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం.. గద్దర్ అవార్డులను ప్రవేశ పెట్టింది. టాలీవుడ్‌ను ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.
గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ డ్యూరి కమిటీ చైర్మన్ నటి జయసుధ.. ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ అవార్డుకు ఎంపికైన నటీనటుల జాబితాను రిలీజ్ చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ పూర్తి చేసిన సినిమాలను ఈ అవార్డుల కోసం సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డు దక్కించుకున్న వారి డీటెయిల్స్ ను అఫీషియల్ గా ప్రకటించాడు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి మళ్లీ ఇలాంటి చలనచిత్ర అవార్డులు ఇవ్వనున్నట్లు దిల్ రాజు వివరించాడు. సినీ ఇండస్ట్రీలో నటీ, నటులతో పాటు.. టెక్నికల్ టీం, ఫీచర్ ఫీలిమ్స్, నేషనల్ యునైటెడ్ మూవీస్, హెరిటేజ్, చైల్డ్ోరియంటెడ్, హిస్టోరికల్ సినిమాలకు సంబంధించిన పురస్కారాలను అందజేయనున్నారు.
అలా ఈ గాధర్ అవార్డుల కోసం అన్ని విభాగాల నుంచి 1248 నామినేషన్స్ పెట్టగా, వ్యక్తిగత కేటగిరీలో 1172 ఫీచర్ ఫిలిం డాక్యుమెంటరీ, ఫిలిం సిటీ తదితర విభాగాల్లో ఏకంగా 76 నామినేషన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే 2024 బెస్ట్ ఫిలిం గా కల్కి 2898 ఏడి మొదటి పొజిషన్ దక్కించుకుంది. ఇక బెస్ట్ యాక్టర్‌గా.. పుష్ప 2 నటనకు గాను అల్లు అర్జున్ చోటు దాక్కించుకున్నాడు. అలాగే స్పెషల్ జూరియా అవార్డ్స్ విజేతలకు లక్కీ భాస్కర్ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ అవార్డు కోసం ఎంపికయ్యారు. ఇలా రకరకాల విభాగాల నుంచి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఈ అవార్డులను దక్కించుకోనున్నారు. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉత్తమ నటుడు అవార్డును బన్నీ దక్కించుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.