ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను రూపొందించి.. రిలీజ్ చేయాలంటే ఎంత లేదన్న 6,7 నెలలైనా సమయం తీసుకుంటున్నారు. స్టార్ హీరో సినిమా అయితే.. ఇక చెప్పనవసరం లేదు. సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల సమయంలో రూపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒక్క సినిమా తీయడానికి ఇన్నేళ్లు గడిపేస్తున్నారు కానీ.. గతంలో మాత్రం ఏడాదిలోనే ఒక హీరో నుంచే పది పదిహేను సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టార్ హీరో నుంచి.. ఒకే ఏడాదిలో ఏకంగా 34 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అందులో 24 సూపర్ హిట్ గా నిలవడం విశేషం. ఇంతకీ.. అసలు ఈ నటుడు ఎవరో.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న ఈ స్టార్ హీరో వయసు సుమారు 65 సంవత్సరాలు. గత 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూనే ఉన్నాడు. ఎన్నో బ్లాక్బస్టర్లు తన ఖాతాలో వేసుకుంటానే ఉన్నాడు. తన అసమాన నటనతో భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగాడు. పేరుకు మళయాళ నటుడైన.. టాలీవుడ్‌లోను పలు సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.
రూ.100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల కలెక్షన్లను ఆయన చేసిన సినిమాలు అవలీలగా దాటేస్తుండడం విశేషం. ఇంతకీ.. ఈ స్టార్ హీరో ఎవరో కాదు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. తాజాగా ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఫొటోస్, వీడియోస్, రికార్డ్ లన్ని తెగ వైరల్ గా మారుతున్నాయి. 1980లో రిలీజ్ అయిన మంజిల్ విరింజ పుక్కల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్‌లాల్.. అప్పటి నుంచి ఇప్పటివరకు సరిగ్గా 45 సంవత్సరాలుగా కెరీర్‌ను రాణిస్తూనే ఉన్నాడు. 1987లో ఆయన 25 కు పైగా సినిమాల్లో నటించాడు. 1984లో 20 కి పైగా సినిమాల్లో చేసాడు. 1985లో 20కి పైగా సినిమాల్లో నటించారు. 1986లో అయితే ఏకంగా 34 సినిమాలు నటించగా.. ఈ సినిమాల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉండేది. ఇందులో భాగంగానే 1986లో రిలీజ్ అయిన 25 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.