స్టార్ ప్రొడ్యూసర్ తో టాలీవుడ్ హీరోయిన్.. సహజీవనం చేస్తుందంటూ ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ స్టార్ బ్యూటీ సదాకు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోస్ తోను కుర్రకారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే తన నటనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సైతం దక్కించుకుంది.
అయితే మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు తిరిగి రీఎంట్రి ఇచ్చి.. ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక సదా తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించింది. 2002లో జయం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే.. రీ ఎంట్రి తర్వాత మాత్రం.. అక్క, వదిన లాంటి పాత్రలో మాత్రమే రాణిస్తుంది. ఇతర భాషల్లో అయితే ఇప్పటికి హీరోయిన్గా పలు సినిమాల్లో నటిస్తుండడం విశేషం. ఇక సదా వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు అయినా.. ఇప్పటివరకు పెళ్లి ఊసే ఎత్తలేదన్న సంగతి తెలిసిందే. సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ అమ్మడు.. వయసు పెరుగుతున్న కొద్ది మరింత అందం, ఫిట్నెస్తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకుంటుంది. అంతేకాదు పలు టీవీ షోలో జడ్జిగాలు వ్యవహరిస్తూ బిజీగా గడుతుంది. ఈ క్రమంలోనే సదాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి నెటింట వైరల్ గా మారుతుంది. గతంలో సదా నటించిన ఎన్నో సినిమాల డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో ఎఫైర్ నడిపిందంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉండేవి. అయితే వాటిలో వాస్తవం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడు ఒక ప్రొడ్యూసర్‌తో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉందని ఇండస్ట్రీలో టాక్ వైరల్ గా మారుతుంది. ఈ నిర్మాతతోనే రిలేషన్‌షిప్‌ని కొనసాగించాలని.. త్వరలోనే వివాహం చేసుకోవాలని అమ్మడు భావిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అమ్మడు క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.