ఆ హీరోయిన్ కెరీర్ నాశ‌నం చేసిన అనుష్క‌… ఇంత జ‌రిగిందా..?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా దాదాపు టాలీవుడ్‌ అగ్ర హీరోల అందరి సరసన నటించి అభినయంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీని రెండు దశాబ్దాల పాటు ఏలేసినా ఈ అమ్మడు.. తన నటనకు ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అయితే నాలుగుపదుల వయసు మీద పడుతున్నా.. ఇప్పటికి అనుష్క వివాహం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే.

అరుంధ‌తి సినిమా ఆమె చేయాల్సిందట‌ - Latest Telugu News | తెలుగు వార్తలు |  NRI Telugu News Paper in USA - Telugu Times

ఇక దాదాపు మూడు ఏళ్లుగా అనుష్క.. అడ‌పాద‌డ‌పా సినిమాల్లోనే మెరుస్తుంది. ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తూంది. కాగా అనుష్క కెరీర్‌ బ్లాక్ బస్టర్ సినిమాలలో.. అరుంధతి కూడా ఒకటి. ఈ సినిమాలో అనుష్క తన నటనకు ప్రశంసలు అందుకుంది. అవార్డులు దక్కించుకుంది. సినిమాల్లో జేజమ్మగా అద్భుత నటనతో మెరిసిన అనుష్క.. తాను తప్ప ఈ పాత్రకు మరెవ‌రు సెట్ కాదు అనేంతలో ఒదిగిపోయింది. అయితే మొదట ఈ సినిమా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రేమను భావించారట.

Baahubali actor Anushka Shetty stuns in a new fit avatar. See pics -  Hindustan Times

కానీ.. తన డేట్స్ ఎడ్జ‌స్ట్ కాకపోవడంతో ఈ సినిమాలో నటి ప్రేమ చేయనని చెప్పేసిందట. వెంటనే ఈ పాత్ర కోసం అనుష్కను అప్రోచ్ కావడం.. ఆమె మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈ సినిమా రిలీజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం జ‌రిగిపోయాయి. ఇక తర్వాత అరుంధతి సినిమాను చూసిన ప్రేమ.. ఈ సినిమాను అనవసరంగా మిస్ చేసుకున్నానని చాలా బాధపడిందట. ఆ సినిమాలో నేను నటించి ఉంటే ఇంకా బాగుండేదని అనుకుందట. ఈ సినిమాలో అనుష్క నటించడం త‌న కెరీర్‌కే పెద్ద దెబ్బ అయ్యింద‌ని ప్రేమ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.