ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. రెండేళ్లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవనున్నాడని.. చరణ్ ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడంటూ.. ఈ క్రమంలోనే ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని.. మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ కూడా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండబోతుందంటూ వివరించాడు. ఈ క్రమంలోనే అకీరా బర్త్డే రోజునే తల్లి రేణు దేశాయ్ ఓ ప్రముఖ ఛానల్ పాడ్ కాస్ట్ లో పాల్గొని సందడి చేసింది. ఇందులో అకీరా ఎంట్రీ పై ఆమె చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు డిస్సప్మెంట్ మిగిల్చాయి. అకీరా త్వరలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని పవన్ అభిమానులంతా ఎంతో గట్టిగా నమ్మారు.
చాలా ఎడిటింగ్ వీడియోలను కూడా షేర్ చేశారు. అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యాయి. కొన్ని.. థియేటర్స్‌లో కూడా ఈ వీడియోస్‌ని ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతలా.. అకీరా ఎంట్రీ గురించి న్యూస్ వైరల్ అయింది. కానీ.. చివరకు రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ అభిమానులు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాంకర్ రేణు దేశాయ్‌ని అడిగితే అకీరా త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నాడట.. పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో గెస్ట్ రోల్లో చేస్తున్నాడట.. ఇక ఆకిరా ఫస్ట్ మూవీకి చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట.. ఇవన్నీ వాస్తవాలేనా అని ప్రశ్నించగా.. దానికి రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ.. అవన్నీ అబద్ధాలే అని వివరించింది.
చరణ్, ఆకిరాను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు అనేది అసలు నిజం కాదు. నేను రాంచరణ్‌తో ఎప్పుడు టచ్ లోనే ఉంటా. అతని కూడా.. నేను ఈ వార్త గురించి అడిగా. నవ్వుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అకీరాకి కూడా ఈ వార్తని షేర్ చేస్తే ఇలాంటి రియాక్షనే ఇచ్చాడు. అసలు అకీరా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోకి రావాలా వద్దా అనేది ఫిక్స్ కాలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు.. ఒకవేళ అకీరా సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే ఉంటే నేనే నా ఇన్‌స్టా ద్వారా అఫీషియల్ గా ప్రకటిస్తా.. అప్పటివరకు వేచి చూడండి అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.