అలనాటి స్టార్ హీరో.. టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకు ఆడవాళ్ళల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన అందానికి, అభినయానికి కేవలం సాధారణ మహిళలే కాదు.. ఎంతో మంది స్టార్ ముద్దుగుమ్మలు సైతం ఆయనకు ఫిదా అవుతూ ఉండేవారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత.. శోభన్ బాబుతో ప్రేమాయణం నడిపిందంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత కాకుండా.. మరో హీరోయిన్ కూడా శోభన్ బాబును పిచ్చిగా ప్రేమించిందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అలనాటి స్టార్ బ్యూటీ శారద. శోభన్ బాబుని ఆమె ఎంతగానో ప్రేమించిందని.. సీనియర్ సినీ జర్నలిస్ట్ విశ్లేషకులు ఇమంది రామారావు చెప్పుకొచ్చాడు.
శోభన్ బాబుని ఎంతగానో ప్రేమించిన తాను.. ఆయనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది. అప్పట్లో వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇండస్ట్రీలో వీళ్ళ కాంబోకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక శోభన్ బాబు తో టైం పాస్ చేయడం అందరికీ నచ్చేదని.. ఆయన వద్ద కూర్చుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమయం తెలియదు. అందమైన ఆకారం.. చెప్పే మాటలు కూడా పూలతో మీటినట్లుగా ఉండేవని.. ఈ క్రమంలోనే ఆడవాళ్లు సైతం ఆయనకు ఫిదా అయ్యేవారు.. సీక్రెట్ విషయాలు, పర్సనల్ విషయాలను కూడా ఆయనతో షేర్ చేసుకునేవారు అంటూ రామారావు చెప్పుకొచ్చాడు. శారద కూడా శోభన్ బాబుతో ఉండేందుకు ఎంతగానో ఇష్టపడే వారని.. ఎన్నో రకాలుగా తన ప్రేమను వ్యక్తం చేసిందని ఆయన వివరించాడు.
ఇక ఆమె లైఫ్‌ను మార్చేసిన మూవీ సంబరాల రాంబాబు. ఇందులో హీరోగా చాలం నటించారు. చలంకి అప్పటికే భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. తోడు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే శారదతో కలిసి నటించిన క్రమంలో తన పర్సనల్ విషయాలను, ఒంటరితనాన్ని శారదాతో పంచుకునేవారు అంటూ రామారావు చెప్పుకొచ్చాడు. ఇక చలం మాటలకు శారదా పడిపోయిందని.. అతనిని చూసి అయ్యో అనుకుందని.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ.. తర్వాత చలం అసలు రంగు బయటపడింది. కొన్నాళ్ల తర్వాత శారదా ఆయన నుంచి విడిపోయింది అంటూ రామారావు చెప్పుకొచ్చాడు. ఆ దెబ్బతో పెళ్లిపై విరక్తి కలిగిన శారదా.. ఒంటరిగానే ఉండిపోయిందట. ఇక శోభన్ బాబు శారద కాంబోలో దాదాపు పది సినిమాల వరకు వచ్చి అన్ని సూపర్ సక్సెస్ అందుకోవడం విశేషం. ఇక శోభన్ బాబు 2008లో మరణించిన సంగతి తెలిసిందే. శారద ఇప్పటికి ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.