ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్‌లో ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలను నిర్మించేందుకు ఇతర ఇండస్ట్రీల నిర్మాతలుకూడా ఆశక్తి చూపుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రారంభమైన ఈ ప్రభంజనం.. పుష్ప 2 వరకు కొనసాగుతూనే ఉంది. ఇండియాలో ప్రస్తుతం టాలీవుడ్ సినీ డామినేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్ఆర్, పుష్ప 1, పుష్ప 2, కల్కి, హనుమాన్, కార్తికేయ 2 ఇలా తెలుగు పాన్ ఇండియన్ సినిమాలు బాక్స్ ఆఫీస్‌ను ఏలేస్తున్నాయి.
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలుగా గతంలో బాలీవుడ్ హీరోల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ.. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు ఆస్థానాన్ని కూడా కబ్జా చేసేసారు. తాజాగా ఓర్మెక్స్ మీడియా సంస్థ డిసెంబర్ నెల కు సంబంధించిన ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోల జాబితా రిలీజ్ చేయగా.. అందులో టాప్ టెన్ హీరోల లిస్టులో కంప్లీట్ గా టాలీవుడ్ హీరోల డామినేషన్ కనిపించింది. టాప్ టెన్‌లో ఐదుగురు టాలీవుడ్ హీరోలు ఉండగా.. ముగ్గురు బాలీవుడ్ నుంచి, ఇద్దరు కోలీవుడ్ నుంచి స్థానాన్ని దక్కించుకున్నారు.
అగ్రస్థానం కూడా టాలీవుడ్ హీరోలకే దక్కింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ పాపులర్ హీరోలలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలిచాడు. పుష్ప 2తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాడు. ఇక మూడో స్థానంలో తమిళ్ హీరో విజయ్ దళపతి, నాలుగో స్థానంలో బాలీవుడ్ బార్‌షా షారుక్, ఐదవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో తాళ అజిత్ కుమార్, ఏడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్, ఎనిమిదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చోటుదక్కించుకున్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు.